Srikanth Odela banner: దసర సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల… మాస్ లో అతనికి మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. తన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. అలాంటి దర్శకుడు ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక తను సినిమా డైరెక్షన్ చేయడమే కాకుండా కొన్ని చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు…ఇక డైరెక్టర్ కేకే ‘KJQ’ అనే సినిమాని చేస్తున్నాడు. కేకే గతంలో నాగార్జునతో కేడి అనే సినిమా చేశాడు… ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో చాలా రోజుల గ్యాప్ తర్వాత KJQ అనే సినిమాను స్టార్ట్ చేశాడు.
ఇక రీసెంట్ గా డైరెక్టర్ కేకే చనిపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది అనే వార్తలైతే వస్తున్నాయి. కానీ శ్రీకాంత్ ఓదెల ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఆల్మోస్ట్ 90% షూట్ కంప్లీట్ అయింది…కాబట్టి శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా కోసం ముందుకు వచ్చి షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా తన బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మంచి అంచనాలైతే ఉన్నాయి. దర్శకుడి హఠాన్మరణం తో సినిమా మీద కొంతవరకు నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నప్పటికి శ్రీకాంత్ ఓదెల దాన్ని పాజిటివ్ గా మార్చే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నాని తో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఈ సినిమా తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే ది ప్యారడైజ్ సినిమా రిలీజైతే గాని ఒక క్లారిటి అయితే రాదు…