Anil Ravipudi Comments On Bhagavanth Kesari: అనిల్ రావిపూడి(Anil Ravipudi) కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉండొచ్చు, భవిష్యత్తులో ఆయన ఇంకా ఎన్నో రికార్డులు క్రియేట్ చేయొచ్చు, కానీ ఎన్ని సినిమాలు చేసినా, ఆయన కెరీర్ లో ఎంతో స్పెషల్ గా నిల్చిన చిత్రం ‘భగవంత్ కేసరి'(Bhagavanth Kesari). నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి హిట్ అయ్యింది, ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. అప్పట్లో అనిల్ రావిపూడి తో బాలయ్య సినిమా అనగానే, బాలయ్య తో అనిల్ కామెడీ చేయించగలడా?, చాలా పెద్ద రిస్కీ ప్రాజెక్ట్ చేస్తున్నాడని అనుకున్నారు, కానీ అనిల్ రావిపూడి నే బాలయ్య జోన్ లోకి వెళ్లి మాస్ + సెంటిమెంట్ జానర్ లో ఈ చిత్రాన్ని తీసి శభాష్ అనిపించుకున్నాడు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా దక్కడం విశేషం.
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి భగవంత్ కేసరి పై చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘బాలకృష్ణ గారితో ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధమైన సినిమా చెయ్యాలని అనుకున్నాను. నా కెరీర్ లో ఎంతో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ ‘భగవంత్ కేసరి’. ఆ సినిమా ఫలితం పట్ల నేను సంతృప్తి గానే ఉన్నాను కానీ, అది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా. ఆ చిత్రం విడుదల సమయం లో చంద్రబాబు నాయుడు గారు జైలు లో ఉన్నారు. నందమూరి అభిమానులంతా నిరాశలో ఉన్న సమయం అది. అందుకే పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది. కానీ సాధారణ మూవీ లవర్స్ ఆ చిత్రాన్ని చూసి హిట్ చేశారు’ అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఇదే చిత్రాన్ని ఇప్పుడు తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన విజయ్ ‘జన నాయగన్’ పేరుతో రీమేక్ చేసాడు.
ఈ సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల అవ్వాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 80 కోట్ల రూపాయిల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చింది. కానీ సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఫలితంగా ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల అవ్వలేదు. కోర్టు లో కేసు నడుస్తూనే ఉంది. అయితే ఆ సినిమా ట్రైలర్ ని చూసినప్పుడు ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని మక్కీకి మక్కి దింపినట్టు అనిపించింది. మంచి మెసేజ్ ఉన్న సినిమా కదా, సెన్సార్ ఎందుకు అభ్యంతరం చెప్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ లో చర్చ మొదలైంది. కానీ ఈ సినిమాలో మన తెలుగు లో లేని పొలిటికల్ టచ్ ఇచ్చారట. కొన్ని సన్నివేశాలు అధికార పార్టీ ని నేరుగా టార్గెట్ చేసినట్టు ఉన్నాయి. అందుకే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని సెన్సార్ సభ్యులు అంటున్నారు.