Cold war between Senior Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు, కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తూ వందల కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొడుతుండటం విశేషం…ఇక రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి సైతం ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో 350 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు… ఈ సినిమా లాంగ్ రన్ లో 450 కోట్ల వరకు కలెక్షన్స్ కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి… గత సంవత్సరం వెంకటేష్ సైతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 300 కోట్లకు పైన భారీ వసూళ్లను రాబట్టాడు…
రీసెంట్ గా బాలయ్య బాబు హీరోగా చేసిన ‘అఖండ 2’ సినిమాతో భారీగా డీలా పడిపోయాడు. ఇక నాగార్జున ఈ మధ్యకాలంలో సోలో హీరోగా ఒక సినిమాని కూడా చేయకపోవడం విశేషం… ఇప్పుడు సీనియర్ హీరోల మధ్య చాలా వరకు కోల్డ్ వారైతే జరుగుతుంది. ఎవరి సినిమా ఎక్కువ కలెక్షన్స్ ను రాబడుతుంది అనే విషయం మీద సోషల్ మీడియాలో వాళ్ళ అభిమానులు సైతం భారీ ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
ఇక హీరోలు సైతం తమ సినిమా కోసం భారీ కసరత్తులు చేసి ఎలాగైనా సరే సినిమాని ఇండస్ట్రీ హిట్ గా మలచాలనే ప్రయత్నంలో ఉన్నారు… స్టార్ హీరోలతో వాళ్లకు సంబంధం లేదు. సీనియర్ హీరోలు తమ తోటి హీరోలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తున్నారు. వాళ్లకు మించి మనం ఎలాంటి హిట్ కొట్టాలి అనే ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఇక రాబోయే రోజుల్లో భారీ సక్సెస్ లను సాధిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఫ్యాన్ వారైతే విపరీతంగా నడుస్తుంది. వారిద్దరి సినిమాల కలెక్షన్స్ ని సోషల్ మీడియాలో పెడుతూ ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించారు. ఎవరు ఇండస్ట్రీ ని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారనే విషయం మీద ఇద్దరి మీద ట్రోల్స్ చేస్తున్నారు…