https://oktelugu.com/

Mohan Babu and Chiranjeevi : చిరంజీవి చేస్తున్న విశ్వంభర మూవీలో స్పెషల్ రోల్ చేస్తున్న మోహన్ బాబు…

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 29, 2024 / 11:21 AM IST

    Chiranjeevi

    Follow us on

    Mohan Babu and Chiranjeevi :  సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నారు. నిజానికి మెగాస్టార్ లాంటి నటుడు కూడా ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఒకపుడు సినిమా ఇండస్ట్రీ తో సంబంధం లేకపోయినా తను ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి స్వశక్తితో ఎదిగి ఇక్కడ సామాన్యుడు కూడా సక్సెస్ ని సాధించొచ్చు అని చూపించిన ఏకైక హీరో చిరంజీవి…

    చిరంజీవికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. దాదాపు 45 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గా కొనసాగుతున్న ఈ స్టార్ హీరో ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద పూర్తి డెడికేషన్ తో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయనకు ప్రత్యేకమైన స్థానం అయితే ఉంటుంది. దాని వల్ల ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నవాడు అవుతాడు. ఇక ఇదిలా ఉంటే వశిష్ట డైరెక్షన్ లో ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఐడెంటిటిని చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తను మరోసారి సత్తా చాటుకుంటే పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతాడు. ఇక ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్రలో మోహన్ బాబు నటించిబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ పాత్ర ఏంటి అనేది బయటికి చెప్పడం లేదు. కానీ ఈ సినిమాలో మోహన్ బాబు అయితే నటిస్తున్నాడనే వార్తలు బీభత్సంగా వినిపిస్తున్నాయి.

    ఇక మోహన్ బాబుకి చిరంజీవికి మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న క్లాషెష్ అయితే వస్తూ ఉంటాయి. కానీ వీళ్ళు మొదటి నుంచి కూడా మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే. ఇక చిరంజీవి ఒకానొక సందర్భంలో వీళ్ళ మధ్య టామ్ అండ్ జెర్రీ వార్స్ అనేవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వాటిని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని ఓపెన్ గా స్టేట్ మెంట్ అయితే ఇచ్చాడు.

    మరి చిరంజీవి తన సినిమాలో కావాలనే మోహన్ బాబుని తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ని మోహన్ బాబు చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో మోహన్ బాబు చేత ఆ క్యారెక్టర్ ని చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా రిలీజ్ అయితే గాని మోహన్ బాబు క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేది తెలియదు.

    ఇక మొత్తానికైతే చిరంజీవి మరోసారి భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే చిరంజీవి స్టార్ హీరోగా పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు…