https://oktelugu.com/

Kamal Haasan : కమల్ హాసన్ చేసిన ఆ సూపర్ హిట్ సినిమాను హాలీవుడ్ లో రీమేక్ చేశారా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి చాలామంది హీరోలుగా సినిమాలను చేస్తున్నప్పటికీ కమల్ హాసన్ లాంటి వైవిధ్యమైన నటనను కనబరిచిన నటులు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. నిజానికి ఆయన పోషించిన పాత్రలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఎవరు చేయలేని పాత్రలనే చెప్పాలి... ఆయన లాంటి గొప్ప నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. అయితే సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ గా నిలిచాయనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : October 21, 2024 / 01:12 PM IST

    Kamal Haasan

    Follow us on

    Kamal Haasan : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే గతంలో ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ సక్సెస్ లను సాధించడం అతని అభిమానుల్లో చాలా ఆనందాన్ని కలిగించింది. నిజానికి ఆయన చేసిన సినిమాల ద్వారానే ఆయన చాలా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. నటనలో గాని, డ్యాన్స్ లో గాని ఆయన చాలా అత్యున్నతమైన పర్ఫామెన్స్ ని చూపిస్తూ ప్రేక్షకులందరిలో చెరగిన ముద్ర వేశాడు…ఇక ఆయన కెరియర్ లో ఆయన ఎన్ని సినిమాలు చేసిన కూడా సురేష్ కృష్ణ దర్శకత్వంలో చేసిన అభయ్ సినిమాకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది.

    ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించినప్పటికి ఈ సినిమాలో ఉన్న వైవిధ్యాన్ని ప్రేక్షకుల ముందు ప్రజెంట్ చేయడంలో మాత్రం అటు సురేష్ కృష్ణ, ఇటు కమల్ హాసన్ ఇద్దరూ కూడా చాలా వరకు సక్సెస్ అయ్యారు. నిజానికి ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే కమల్ హాసన్ అందించాడు.

    సురేష్ కృష్ణ దర్శకత్వం చేశాడు. ఇక 2001 లో ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధిస్తుందని అందరు అనుకున్నప్పటికి ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో కంటెంట్ అప్పుడున్న ప్రేక్షకులకు అంత బాగా రీచ్ అయితే అవ్వలేదు. కానీ ఆ తర్వాత ఈ సినిమాని హాలీవుడ్ వాళ్ళు ‘కిల్ బిల్’ అనే పేరుతో రీమేక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. నిజానికి ఈ సినిమాని హాలీవుడ్ లో తీసిన విధానం చాలా అద్భుతంగా ఉంది.

    అలాగే కథ కూడా మన సినిమా కథతోనే ఉండటం వల్ల ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ అయితే దక్కింది. ఈ సినిమాని చూసి మళ్లీ మరికొన్ని తెలుగు సినిమాలను కూడా చేశారు. నిజానికి కిల్ బిల్ సినిమాను మన ఇండియన్ సినిమా అయిన అభయ్ ని చూసి చేయడం అనేది నిజంగా ఇండస్ట్రీకి దక్కిన ఒక అరుదైన గౌరవమనే చెప్పాలి… ఏది ఏమైనా కూడా ఆయన నటించిన ఒక సినిమా హాలీవుడ్ లో రీమేక్ అవ్వడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఇప్పటికీ కూడా కమల్ హాసన్ లాంటి నటుడు ఇండియన్ ఇండస్ట్రీలో మరొక వ్యక్తి లేడు…