https://oktelugu.com/

SS Rajamouli : రాజమౌళి ని టార్గెట్ చేసిన ముగ్గురు స్టార్ డైరెక్టర్లు… కారణం ఏంటి..?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్న కూడా రాజమౌళికి ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఆయన చేసిన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు...

Written By:
  • Gopi
  • , Updated On : October 21, 2024 / 01:44 PM IST

    SS Rajamouli

    Follow us on

    SS Rajamouli :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమా వరకు అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి. అలాంటి దర్శకుడు చేస్తున్న ప్రతి సినిమా మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటాడనే విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలో రాజమౌళి లాంటి దర్శకుడు చేస్తున్న ప్రతి సినిమా సక్సెస్ ఫుల్ గా నిలవడంలో ఆయన ఎలాంటి పాత్ర వహిస్తాడు అనేది కూడా తెలుసుకోవాలని చాలామంది కుతూహలం తో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ప్రస్తుతం ఆయన నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఆయన చేసిన బాహుబలి సిరీస్ అలాగే త్రిబుల్ ఆర్ సినిమాలు పాన్ ఇండియాలో అద్భుతాలను సృష్టించాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన చేసిన ప్రతి సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉంటున్నాయి. దానికి తగ్గట్టుగానే ఆయన ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…

    ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ రాజమౌళి లాంటి దర్శకుడు ఇండియన్ ఇండస్ట్రీలో మరొకరు లేరు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ కొంతమంది దర్శకులు రాజమౌళిని ఢీకొట్టే విధంగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు వాళ్ళ సినిమాలతో రాజమౌళి ని ఢీకొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.

    తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వీరు ముగ్గురు భారీ సక్సెస్ లను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక రీసెంట్ గా వీళ్ళు ముగ్గురు చేసిన సినిమాలు కూడా భారీ సక్సెస్ ని సాధించి ప్రొడ్యూసర్లకు భారీ లాభాలను తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇప్పుడు వీళ్ళు రాజమౌళి ని మాత్రమే వాళ్లకు టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ స్థాయిని దాటి ఆయన పాన్ వరల్డ్ లోకి వెళ్లడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

    ఇక మీదట నుంచి పాన్ వరల్డ్ లో కూడా తెలుగు సినిమా చేయబోయే అద్భుతాలు కనిపిస్తాయి. కాబట్టి రాజమౌళిని ఢీకొట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కానీ వీళ్ళు ముగ్గురు ప్రయత్నం చేస్తే మాత్రం అంత కష్టమేమీ కాదని కొంతమంది సినీ విమర్శకులు కూడా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం…