Peddi Movie Step: గ్రూప్ డ్యాన్సర్ గా మొదలై, నేషనల్ అవార్డు ని సొంతం చేసుకునే స్థాయికి ఎదిగిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఇతన్ని టాలీవుడ్ కి కొరియోగ్రాఫర్ గా పరిచయం చేసింది రామ్ చరణ్. రచ్చ నుండి త్వరలో విడుదల కాబోతున్న ‘పెద్ది’ వరకు, రామ్ చరణ్ తన ప్రతీ సినిమాకు జానీ మాస్టర్ ని కొరియోగ్రాఫర్ గా పెట్టుకునే వాడు. ఆయన కంపోజ్ చేసిన స్టెప్పులు రామ్ చరణ్ వేస్తే ఇండియా మొత్తం షేక్ అయ్యేది. అలా రామ్ చరణ్ ద్వారా కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో పెద్ద పెద్ద సూపర్ స్టార్ సినిమాలకు కొరియోగ్రఫీ చేసి నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే జానీ మాస్టర్ ఒక విషయం లో ఆరోపణలు ఎదురుకుంటూ అరెస్ట్ అయ్యాడో, అప్పటి నుండే ఆయన కెరీర్ అంధకారం లోకి వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు.
కానీ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ రామ్ చరణ్ అతనికి పునర్జన్మ ని ఇచ్చాడు. ‘పెద్ది’ సినిమాలోని పాటలకు కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇప్పించాడు. నిన్న ఈ చిత్రం నుండి విడుదలైన ‘చికిరి’ ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. రేపు పూర్తి పాట విడుదల కాబోతుంది. ఈ ప్రోమో లో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియా ని షేక్ చేస్తోంది. కాస్త డిఫరెంట్ గా ఉండేలా ఈ స్టెప్పుని కంపోజ్ చేసాడు కానీ, అది చూసే ఆడియన్స్ కి వేరే లాగా అనిపించింది. సోషల్ మీడియా లో మీమర్స్ దానిని ఫన్నీ సంఘటనలకు ఉపయోగించుకుంటూ ఒక రేంజ్ లో ఎడిటింగ్స్ చేస్తున్నారు. ఆ ఎడిటింగ్ వీడియోస్ ని చూస్తే ఎవరికైనా నవ్వు రావాల్సిందే. చిన్న 20 సెకండ్స్ బిట్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే, రేపు పూర్తి పాట విడుదల అయ్యాక ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు.
అయితే జానీ మాస్టర్ లో ఒకప్పుడు ఉండే క్రియేటివిటీ, ఈమధ్య కాలం లో ఎందుకో తగ్గిందని అంటున్నారు విశ్లేషకులు. అప్పట్లో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు, చూసే ఆడియన్స్ కి ఎంతో అందంగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఆయన కంపోజ్ చేస్తున్న స్టెప్పులు ట్రోల్ మెటీరియల్ గా మారిపోతున్నాయి. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సరైన ప్రాక్టీస్ చేయలేకపోయాడా ?, ఆ కారణంగానే ఇలా అయ్యిందా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆయన జైలుకు వెళ్ళకముందు చేసిన చివరి చిత్రం ‘గేమ్ చేంజర్’. ఇందులో ఆయన ‘Dhop’ పాటను కంపోజ్ చేసాడు. పెద్ద క్లిక్ అవుతుందని అనుకున్నారు కానీ, ఇది కూడా అవ్వలేదు. దీంతో కచ్చితంగా జానీ మాస్టర్ లో ఒకప్పటి క్రియేటివిటీ ఇప్పుడు బాగా తగ్గిందని అంటున్నారు.