Harihara Veeramallu: క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా మొదలైన సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకు ఏఎం రత్నం నిర్మాత. సినిమా ఇప్పటికే 50 శాతం పూర్తయ్యింది. ఇంకా 50 శాతం మిగిలి ఉంది. అయితే హరిహర వీరమల్లును ఆపి మరీ పవన్ కళ్యాణ్ తన మిత్రుడు ‘త్రివిక్రమ్’ చేపట్టాడని ‘భీమ్లానాయక్’ను పూర్తి చేశాడు. ఇక్కడే ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఎండ్ కార్డ్ పడింది. త్రివిక్రమ్ కనుక మధ్యలో దూరకుంటే ఇప్పటికే హరిహర వీరమల్లు పూర్తయ్యింది. అప్పటి నుంచి ఈ సినిమా పట్టాలెక్కడానికి ఏదో అవాంతరం వస్తోంది. నిర్మాత ఎంత మొత్తుకుంటున్నా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఏకంగా వచ్చే వేసవికి వాయిదా పడింది.
నిర్మాత ఏఎం రత్నం తాజాగా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో తన ఆవేదన వెళ్లగక్కారు. ఆయన మాటలు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. హరిహర వీరమల్లు ఇప్పట్లో విడుదల కాలేదని.. వచ్చే వేసవికి వాయిదా వేసినట్టు తెలిపారు. ఈ పీరియాడికల్ డ్రామా ను మార్చ 30 , 2023కు విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తామన్నది మాత్రం ఏఎం రత్నం పేర్కొనలేదు.
Also Read: Payal Rajput: 50 లక్షల కోసం పాయల్ రాజ్ పుత్ సంచలన నిర్ణయం.. ఆ సీన్స్ కి సై.. సంతోషంలో నిర్మాతలు
అయితే ట్విస్ట్ ఏంటంటే ఇటీవల విజయవాడలో జనసేన నేతలతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ తాను సినిమాలు చేయనని ప్రకటించారు. అక్టోబర్ నుంచి తన యాత్రపైనే దృష్టి సారిస్తానని చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ యాత్రలో బిజీగా ఉంటే ‘హరిహర వీరమల్లు’కు సమయం ఎక్కడ దొరుకుతుందన్నది ప్రశ్న. మార్చిలో విడుదల చేయడానికి దర్శకుడు క్రిష్ ఎలా పూర్తి చేస్తాడన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ లా మారింది.
పవన్ కళ్యాణ్ సీరియస్ పాలిటిక్స్ దిశగా ముందుకెళుతున్నారు. భీమ్లానాయక్ విడుదల తర్వాత ‘హరిహర వీరమల్లు’ను పూర్తి చేద్దామని అనుకున్న వైరల్ ఫీవర్ తో దాదాపు 20 రోజులు పవన్ మంచానికే పరిమితం అయ్యారు. ఇప్పుడు టైం ఉన్నా రాజకీయ మీటింగ్ లతో బిజీ అయ్యారు. సో ఇప్పుడప్పుడే హరిహర సినిమాకు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత మిగిలిన 50 శాతం షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తారు? పవన్ యాత్రలో ఉంటే ఎలా సాధ్యమన్నది మాత్రం తెలుపడం లేదు. చూస్తుంటే ఈ సినిమా పూర్తయ్యి రిలీజ్ కావడం కూడా కత్తిమీద సామేనంటున్నారు. అంతా పవన్ చేతుల్లోనే ఉందంటున్నారు.
Also Read:Director Lingusamy: రామ్ ‘ది వారియర్’ మూవీ డైరెక్టర్ లింగుస్వామి కి 6 నెలల జైలు శిక్ష