https://oktelugu.com/

Allu Sirish: అల్లు శిరీష్ ఇంట్లోంచి వెళ్లిపోయాడా? బన్నీతో విభేధాలే కారణమా ?

Allu Sirish: అల్లు శిరీష్ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడన్న వార్తలు టాలీవుడ్ లో గుప్పుమన్నాయి. అన్న, తండ్రిపై కోపంతో అతడు ఇంటిని వదిలేసి వెళ్లిపోయాడంటూ సంచలన కథనాలు వెలువడుతున్నాయి. టాలీవుడ్ బడా కుటుంబాలలో ఒకటైన అల్లువారి ఇంటిలో విబేధాలు చెలరేగాయంటూ మీడియా కోడై కూస్తుంది. విషయంలోకి వెళితే… స్టార్ ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ పరిశ్రమలో తనకంటూ ఓ స్థాయిని సంపాదించుకున్నారు. స్క్రిప్ట్ సెలక్షన్ తో పాటు బడ్జెట్ విషయాల్లో పక్కాగా ఉండే అల్లు అరవింద్ ఎందరో […]

Written By:
  • Shiva
  • , Updated On : August 18, 2022 / 09:07 AM IST

    Allu Sirish

    Follow us on

    Allu Sirish: అల్లు శిరీష్ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడన్న వార్తలు టాలీవుడ్ లో గుప్పుమన్నాయి. అన్న, తండ్రిపై కోపంతో అతడు ఇంటిని వదిలేసి వెళ్లిపోయాడంటూ సంచలన కథనాలు వెలువడుతున్నాయి. టాలీవుడ్ బడా కుటుంబాలలో ఒకటైన అల్లువారి ఇంటిలో విబేధాలు చెలరేగాయంటూ మీడియా కోడై కూస్తుంది. విషయంలోకి వెళితే… స్టార్ ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ పరిశ్రమలో తనకంటూ ఓ స్థాయిని సంపాదించుకున్నారు. స్క్రిప్ట్ సెలక్షన్ తో పాటు బడ్జెట్ విషయాల్లో పక్కాగా ఉండే అల్లు అరవింద్ ఎందరో నిర్మాతలకు ఆదర్శం. మంచి జడ్జిమెంట్ కలిగిన అల్లు అరవింద్ అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కించారు.

    Allu Sirish

    ఇక రెండో కొడుకు అల్లు అర్జున్ టాప్ స్టార్ కావడంలో తన వంతు కృషి చేశారు. మెగా ఫ్యామిలీ నుండి పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ అందరికంటే ఓ మెట్టు పైన ఉన్నారు. అదే సమయంలో అల్లు అరవింద్ చిన్న కుమారుడు కనీసం టైర్ టు హీరో కాలేకపోయాడు. అల్లు శిరీష్ హీరోగా పరిచయమై పదేళ్లు కావస్తున్నా… కనీస గుర్తింపుకు నోచుకోలేదు. 2013లో విడుదలైన ‘గౌరవం’ మూవీతో శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

    ఈ పదేళ్లలో అరడజను సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు. ఇమేజ్ తెచ్చిపెట్టే ఒక్క హిట్ పడలేదు. ఇది ఆయనను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. తన ఫెయిల్యూర్ వెనుక తండ్రి అల్లు అరవింద్, అన్న బన్నీ నిర్లక్ష్యం ఉందని శిరీష్ గట్టిగా నమ్ముతున్నాడట. ముఖ్యంగా తండ్రిపై అతడు కోపంగా ఉన్నాడట. అల్లు అర్జున్ ని స్టార్ ని చేయడానికి అహర్నిశలు కష్టపడిన అల్లు అరవింద్… తనను పట్టించుకోవడం లేదని గట్టిగా నమ్ముతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తాయట.

    Allu Sirish

    ఇంటిని వదిలేసి ముంబై వెళ్ళిపోయిన అల్లు శిరీష్ అక్కడే ఉంటున్నాడట. కుటుంబ సభ్యులతో కలవడానికి, మాట్లాడటానికి ఇష్టపడం లేదట. ఈ కారణంగా అల్లు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని బోగట్టా. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా ‘ప్రేమ కాదంట’ టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆమెతో అల్లు శిరీష్ ఎఫైర్ పెట్టుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
    Recommended Videos

    Tags