Haro Nani: నాని ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్లు.. ఇంతకీ వారి లైఫ్ ఎలా ఉందో తెలుసా?

నాని, నిత్యా మీనన్, కార్తీక్ కుమార్, బిందు మాధవి నటించిన సెగ సినిమా క్రైమ్ యాక్షన్ చిత్రం. ఈ సినిమాతో అనాజా అలీ ఖాన్ దర్శకత్వ రంగంలో తన తొలి ప్రయాణం మొదలుపెట్టారు.

Written By: Suresh, Updated On : October 12, 2023 1:57 pm
Follow us on

Haro Nani: చిన్న సినిమాల నుంచి ప్యాన్-ఇండియా స్టార్‌గా ఎదిగాడు నేచురల్ స్టార్ నాని.బాల్యం నుంచే సినిమాలపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. అంతేకాదు సినిమాలపై మక్కువతో ఇదే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని అనుకున్నాడు. మొదట్లో, నానీ.. దర్శకుడిగా అవ్వాలని అనుకున్నాడు. కానీ నటనలో ఆఫర్లు రావడంతో యాక్టర్ గా అడుగులు వేశాడు. అలా 2008 లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నాని. ఈ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.అయితే నాని హీరోగా ఎదగడం మాత్రమే కాదు ఆయన వల్ల ఎంతో మంది డైరెక్టర్లు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. అయితే నాని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ డైరెక్టర్లు ఎవరో ఒకసారి చూసేద్దాం..

సత్యం బెల్లంకొండ – స్నేహితుడు (2009)
సత్యం బెల్లంకొండ దర్శకత్వం వహించిన స్నేహితుడు సినిమా రొమాంటిక్ డ్రామా..ఇందులో నాని సరసన మాధవి లత నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించనప్పటికీ, సత్య బెల్లంకొండకు కొత్త కంటెంట్‌పై ప్రయత్నించే అవకాశం అయితే దక్కిందనే చెప్పాలి.

తాతినేని సత్య – భీమిలి కబడ్డీ జట్టు (2010)
‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాతో కూడా మరో కొత్త డైరెక్టర్ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో నాని సరసన శరణ్య మోహన్ నటించింది. నూతన దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా. తమిళ చిత్రం ‘వెన్నిల కాడి కుజు’కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా కొన్ని సెంటర్లలో 100 రోజులకు పైగా రన్ అయ్యింది.

నందిని రెడ్డి – అలా మొదలైంది (2011)
శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై బి.వి.నందిని రెడ్డి రూపొందించిన రొమాంటిక్ కామెడీ చిత్రం అలా మొదలైంది. ఈ సినిమా నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి నిత్యా మీనన్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో స్నేహ ఉల్లాల్ కూడా సెకండ్ హీరోయిన్ గా లీడ్ రోల్ పోషించింది. ఈ సినిమాకు కల్యాణి మాలిక్ స్వరాలు సమకుర్చారు. అయితే ఈ సినిమా తర్వాత నందిని రెడ్డి టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది.

అంజనా అలీ ఖాన్ – వెప్పం/సెగ (2011)
నాని, నిత్యా మీనన్, కార్తీక్ కుమార్, బిందు మాధవి నటించిన సెగ సినిమా క్రైమ్ యాక్షన్ చిత్రం. ఈ సినిమాతో అనాజా అలీ ఖాన్ దర్శకత్వ రంగంలో తన తొలి ప్రయాణం మొదలుపెట్టారు. ఈ చిత్రంతోనే నేచురల్ స్టార్ నాని తమిళ సినీ రంగ ప్రవేశం కూడా చేశారు.. అయితే ఈ సినిమా సౌత్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ చిత్రంగా నిలిచింది.

A.గోకుల్ కృష్ణ – ఆహా కళ్యాణం (2014)
నూతనంగా గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా ఆహా కళ్యాణం. అయితే ఈ సినిమా 2014లో రిలీజైంది. ఇక ఈ సినిమాను రూ. 10 కోట్లతో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద రూ. 22 కోట్లను సంపాదించింది. ‘బ్యాండ్ బాజా భారత్’ అనే హిందీ సినిమా నుంచి రీమేక్ చేశారు.

నాగ్ అశ్విన్ – ఎవడే సుబ్రమణ్యం (2015)
నాగ్ అశ్విన్ రూపొందించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నాని సరసన మాళవిక నాయర్ నటించింది. ఇక విజయ్ దేవరకొండ, రీతూ వర్మ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం స్లో-పేస్డ్ కథనం వల్ల విమర్శల పాలైంది. అయితే, ఈ సినిమా వల్ల నాగ్ అశ్విన్ కు మరిన్ని ప్రాజెక్టులు వచ్చాయి అని చెప్పడంలో సందేహం లేదు.

శివ నిర్వాణ – నిన్ను కోరి (2017)
‘నిన్ను కోరి’సినిమా వల్ల కూడా కొత్త దర్శకుడు శివ నిర్వాణ ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన నిన్ను కోరి సినిమా రొమాంటిక్ కామెడీ డ్రామా. ఈ చిత్రంలో నివేదా థామస్, ఆది పినిశెట్టి, నాని ప్రధాన పాత్రలు పోషించారు, ఇక బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళంలో ‘తల్లి పొగతేయ్’గా రీమేక్ చేశారు.

శ్రీకాంత్ ఓదెల – దసరా (2023)
శ్రీకాంత్ ఓదెల రచన, దర్శకత్వం వహించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా దసరా. ఈ సినిమాలో కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ వంటి ఎంతో మంది తారలు నటించారు. తెలంగాణ లోని గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.ఈ ఒక్క సినిమాతోనే శ్రీకాంత్ ఓదెల టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమై.. మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు.