https://oktelugu.com/

Manchu Lakshmi: ఏంటా డ్రెస్.. బర్త్ డే నాడు బహిరంగంగా మంచు లక్ష్మీ వేసుకొన్న డ్రెస్ షాకింగ్.. నెటిజన్స్ హాట్ కామెంట్స్

జనాల మీద పగబట్టావా ఏమిటని కామెంట్స్ చేస్తున్నారు. అక్టోబర్ 8న మంచు లక్ష్మి జన్మదినం కాగా గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. రకుల్ ప్రీత్, ప్రగ్యా జైస్వాల్, తాప్సి పన్నుతో పాటు మిత్రులు, పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు.

Written By:
  • Shiva
  • , Updated On : October 12, 2023 / 01:21 PM IST

    Manchu Lakshmi

    Follow us on

    Manchu Lakshmi: అతి చేయడంలో మంచు ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా. అందుకే వీళ్ళ ఓవర్ యాక్షన్ మీద వేలకొలది మీమ్స్ పుట్టుకొచ్చాయి. తండ్రి మోహన్ బాబు నట వారసత్వం అబ్బకున్నా అతి మాత్రం ఒంటబట్టింది. మంచు లక్ష్మి కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నిలబడలేదు. ఆమెకు కనీస ఇమేజ్ లేదు. తనను టాప్ సెలెబ్ లా ఫీల్ అవుతుంది. నలుగురైదుగురు హీరోయిన్స్ తో స్నేహం కొనసాగిస్తూ, తాను కూడా టాప్ హీరోయిన్ అనుకుంటుంది. కాగా తన బర్త్ డే పార్టీలో మంచు లక్ష్మి కోతి చేష్టలపై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.

    జనాల మీద పగబట్టావా ఏమిటని కామెంట్స్ చేస్తున్నారు. అక్టోబర్ 8న మంచు లక్ష్మి జన్మదినం కాగా గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. రకుల్ ప్రీత్, ప్రగ్యా జైస్వాల్, తాప్సి పన్నుతో పాటు మిత్రులు, పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ బర్త్ డే పార్టీలో ఆమె వేసిన డ్రెస్, చేష్టలు వెగటు పుట్టించేలా ఉన్నాయి. టాప్ టు బాటమ్ పింక్ కలర్ ఉండేలా చూసుకుంది. రెండు పిలకలు, షార్ట్, టాప్ లో విచిత్రంగా తయారైంది.

    దానికి తోడు చిందులు వేస్తూ గెస్ట్స్ ని విచిత్రంగా పలకరిస్తూ రచ్చ రచ్చ చేసింది. ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో నెటిజెన్స్ అవాక్కయ్యారు. ఈ గెటప్ ఏంటి బాబోయ్ అంటూ భయపడుతున్నారు. మంచు లక్ష్మి దారుణ లుక్ వైరల్ గా మారింది. అయితే ఇదంతా ఆత్మవిశ్వాసం అంటుంది మంచు లక్ష్మి. నచ్చినట్లు బ్రతకడమే లైఫ్. ఎవరి కోసమో బ్రతక కూడదు అంటుంది. ఇటీవల ఎయిర్ పోర్ట్ నిర్వహణ సరిగా లేదు, నా ఐ ఫోన్ కెమెరా వలన మ్యాట్ కొంచెం బెటర్ గా కనిపిస్తుందని వీడియో పోస్ట్ చేసింది.

    ఆ వీడియోపై నెటిజెన్స్ నెగిటివ్ కామెంట్స్ చేశారు. నువ్వు ఐ ఫోన్ వాడుతున్నావని, బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నావని మాకు తెలియాలనేగా ఈ వీడియో అంటూ ఎద్దేవా చేశారు. నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపై మంచు లక్ష్మి ఫైర్ అయ్యింది. అవును నా లగ్జరీ లైఫ్ నా డబ్బులతో గడుపుతున్నాను. నీకేంటి నొప్పి. నువ్వేమైనా ఇస్తున్నావా?. నేను ఎవడి కోసమో బ్రతకాలా. నా కంటూ కెరీర్ ఉండకూడదా. ఆడాళ్ళు అంటే వంట గదికే పరిమితం కావాలా? అంటూ వీడియో పోస్ట్ చేసింది.