Dil Raju: ప్రకాష్ రాజ్ ను పట్టుకొని చిన్న పిల్లాడిలా ఏడ్చిన దిల్ రాజు….

దిల్ రాజు భార్య అయిన అనిత 2017 వ సంవత్సరం లో అనారోగ్య కారణాల వల్ల మరణించడం జరిగింది.దాంతో దిల్ రాజు తేజస్విని రెడ్డి అనే ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు.

Written By: Gopi, Updated On : October 12, 2023 1:37 pm

Dil Raju

Follow us on

Dil Raju: సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి రీసెంట్ గా సీనియర్ నటులు వరుస ఇండస్ట్రీ ని వదిలి స్వర్గస్తులైన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు ఫాదర్ అయిన శ్యామ్ సుందర్ రెడ్డి (85) కూడా అనారోగ్య కారణం గా మరణించడం జరిగింది. ఇక ఈయన మరణ వార్త విన్న చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు వచ్చి దిల్ రాజుని పరామర్శిస్తూ వాళ్ల సానుభూతి ని వ్యక్తం చేశారు.ఇక ఇలాంటి క్రమంలో దిల్ రాజుకు అత్యంత ఆప్తుడైన ప్రకాష్ రాజ్ కూడా శ్యాంసుందర్ రెడ్డి గారి అంతిమ యాత్ర లో పాల్గొనడం జరిగింది. అయితే ప్రకాష్ రాజ్ ను చూసిన దిల్ రాజు ఎమోషనల్ అయి ఆయన్ని పట్టుకొని చిన్నపిల్లవాడిలా ఏడవడం జరిగింది.అయితే తండ్రి మరణ వార్తను జీర్ణించుకోలేక పోయిన దిల్ రాజు అలా ఏడుస్తూ ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు తెప్పించాడు. దిల్ రాజు ఏడుస్తుంటే ఆయన ఏడుపుకి కరిగిపోయి ప్రకాష్ రాజు కళ్ళల్లో నుంచి కూడా కన్నీళ్లు రావడం జరిగింది.

అలాగే దిల్ రాజు కి మేము అందరం ఉన్నామంటూ ధైర్యం చెబుతూ దిల్ రాజు ని ఓదార్చాడు.నిజానికి ప్రకాష్ రాజ్ కి దిల్ రాజు కి మధ్య చాలా సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉంది దాంతో వాళ్ల నాన్న ని కోల్పోయిన దిల్ రాజు కి ఒంటరి వాడిని అయిపోయాను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ కనిపించడంతో తను చిన్న పిల్లాడిలా ఏడవడం నిజంగా బాధని కల్గించింది.ఇక ఇప్పటికే దిల్ రాజు భార్య అయిన అనిత 2017 వ సంవత్సరం లో అనారోగ్య కారణాల వల్ల మరణించడం జరిగింది.దాంతో దిల్ రాజు తేజస్విని రెడ్డి అనే ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు. దాంతో వీళ్ళిద్దరికీ రీసెంట్ గా ఒక కొడుకు కూడా పుట్టాడు…

అయితే శ్యామ్ సుందర్ రెడ్డి గారిది స్వతహాగా నిజామాబాద్ అయినప్పటికీ దిల్ రాజు మాత్రం చదువుకోవడానికి హైద్రాబాద్ వచ్చి ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమా ఇండస్ట్రీ లో ప్రొడ్యూసర్ గా సెటిల్ అయ్యాడు నిజానికి దిల్ రాజు లాంటి టాప్ ప్రొడ్యూసర్ కి ఇలాంటి భాదలు రావడం చాలా మంది సినిమావాళ్లని కూడా తీవ్రమైన భాదకి గురి చేసే అంశం అనే చెప్పాలి.ఇక దిల్ రాజు ఇప్పుడు రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ లాంటి ఒక భారీ మూవీ ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు…ఇక ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల వరకు బడ్జెట్ ని పెడుతున్నట్టు గా కూడా తెలుస్తుంది…