https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నీకు వెన్నుపోటు పొడుస్తాడు జాగ్రత్త అంటూ ‘గంగవ్వ’ కి మణికంఠ విషయంలో వార్నింగ్ ఇచ్చిన హరితేజ..ఏడ్చేసిన మణికంఠ!

వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్స్ మన లాగానే బయట ఆయన ఆటని చూసి పాజిటివ్ అభిప్రాయం తో లోపలకు వెళ్లారు. కానీ ఎలాంటి పాజిటివ్ అభిప్రాయంతో వాళ్ళు లోపలకు వెళ్లారో, అదే అభిప్రాయం మాత్రం ఇప్పుడు ఆయన పై లేదు. నయనీ పావని, గౌతమ్, హరితేజ, రోహిణి ఇలా అందరికీ నాగ మణికంఠ అసలు ప్రవర్తన చూసి లోపల వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 20, 2024 / 08:48 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8:  ఈ సీజన్ బిగ్ బాస్ షోలో టాప్ 5 కంటెస్టెంట్స్ లో కచ్చితంగా ఒకడిగా ఉంటాడని భావించిన నాగ మణికంఠ, ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఆయన అభిమానులకే కాకుండా, నాగ మణికంఠ ని ద్వేషించేవారికి కూడా పెద్ద షాక్ అని చెప్పాలి. అయితే మొదటి ఎపిసోడ్ నుండి నేటి వరకు నాగ మణికంఠ చేసింది డ్రామానా?, లేకపోతే నిజమా అనేది ఇప్పటికీ అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్స్ మన లాగానే బయట ఆయన ఆటని చూసి పాజిటివ్ అభిప్రాయం తో లోపలకు వెళ్లారు. కానీ ఎలాంటి పాజిటివ్ అభిప్రాయంతో వాళ్ళు లోపలకు వెళ్లారో, అదే అభిప్రాయం మాత్రం ఇప్పుడు ఆయన పై లేదు. నయనీ పావని, గౌతమ్, హరితేజ, రోహిణి ఇలా అందరికీ నాగ మణికంఠ అసలు ప్రవర్తన చూసి లోపల వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యింది.

    ఇదంతా పక్కన పెడితే మొన్న జరిగిన ఎపిసోడ్ లో మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ జరిగినప్పుడు మణికంఠ హరితేజ తో ఎంతో మంచిగా ఉంటూ, గౌతమ్ తో డీలింగ్ పెట్టుకొని, హరితేజ ని టాస్కు నుండి తొలగించిన ఘటనకు హరితేజ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఒక్కసారి మణికంఠ పై ఆమెకు ఉన్న అభిప్రాయం ఈ సంఘటనతో నెగటివ్ అయిపోయింది. అయితే నిన్న ఎపిసోడ్ ప్రారంభం లో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడే ముందు, శుక్రవారం రోజు జరిగిన ఎపిసోడ్ ఫుటేజీ ని చూపిస్తారు. ఈ ఎపిసోడ్ లో మణికంఠ హరితేజ తో మాట్లాడుతూ టాస్క్ నుండి ఎందుకు తొలగించాడో చెప్పుకున్నాడు. అప్పుడు హరితేజ అంత బాగానే ఉంది కానీ, నువ్వు నన్ను ఇక్కడ సపోర్ట్ అడిగి, గౌతమ్ తో డీలింగ్ పెట్టుకోవడం నన్ను పెద్ద షాక్ కి గురి చేసింది అని చెప్పుకొస్తుంది. ఆ తర్వాత మణికంఠ వివరించే ప్రయత్నం చేయగా హరితేజ ఒప్పుకోదు.

    ఆమె వెళ్ళిపోయినా తర్వాత మణికంఠ కెమెరాతో మాట్లాడుకుంటూ ‘నా కోడి బుర్రతో ఏమి చేసిన ఇక్కడ అందరూ స్ట్రాటజీ అనుకుంటున్నారు. టాస్కులు ఆడేందుకు నా శరీరం కూడా సహకరించడం లేదు. మాట్లాడేటప్పుడు కూడా నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇప్పటి వరకు హౌస్ లో నెట్టుకొచ్చాను, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను, ఇక నావల్ల కాదు, దయచేసి నాకు ఓట్లు వేయడం ఆపేయండి, నేను వెళ్లిపోవాలని అనుకుంటున్నాను’ అని మణికంఠ కెమెరాకి చెప్పుకుంటాడు. అయితే అతను డల్ గా ఏడుస్తూ కూర్చోవడాన్ని చూసిన గంగవ్వ తన చేతుల మీద వంట చేసుకొని వచ్చి గౌతమ్ కి ప్రేమతో ఇస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హరితేజ, జాగ్రత్త అవ్వా, ముసలిదానివి అని కూడా ఆలోచించడు, తన తదుపరి టార్గెట్ నువ్వే, వెన్నుపోటు పొడుస్తాడు అని అంటుంది. ఇది విన్న మణికంఠ ఫీల్ అయ్యి ఏడ్చేస్తాడు, అప్పుడు హరితేజ ఊరికే జోక్ గా అన్నాను, ఏమి అనుకోకు అని ఓదారుస్తుంది.