https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారికి ఈరోజు అనుకోని ఆదాయం.. డబ్బే డబ్బు..

తులారాశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల పై ప్రభావం పడుతుంది. ఆయారాశుల వారి ఆదాయం పెరుగుతుంది. మరికొన్ని రాశుల వారికి శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 20, 2024 / 08:33 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఆదివారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఈ సందర్భంగా గజకేసరి యోగం ఏర్పడనుంది. తులారాశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల పై ప్రభావం పడుతుంది. ఆయారాశుల వారి ఆదాయం పెరుగుతుంది. మరికొన్ని రాశుల వారికి శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది.

    మేష రాశి:
    పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. డబ్బుఎక్కువగా ఖర్చు అవుతుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఎవరికీ డబ్బు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి.

    వృషభ రాశి:
    శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. కొందరి నుంచి వీరికి ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    మిథున రాశి:
    వ్యాపారులు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు. అనారోగ్యాన బారిన పడుతారు. పిల్లల కెరీర్ విషయంలో అశుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో కష్టాలను ఎదుర్కొంటారు.

    కర్కాటక రాశి:
    ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పెద్దలతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారులు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే కుటుంబ సభ్యుల మద్దతు అవసరం. ఉద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి.

    సింహారాశి:
    వ్యాపారులకు కొత్త భాగస్వాములు తోడవుతారు. ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని పొందుతారు. నివాసం మరమ్మతుల కోసం ఖర్చు చేస్తారు. కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లాభపడుతారు.

    కన్య రాశి:
    నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రభుత్వ ఉద్యోగులు తోటివారితో జాగ్రత్తగా ఉండాలి. కొందరు మీ పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    తుల రాశి:
    కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. వైవాహిక జీవతం సంతోషంగా ఉంటుంది. మానసికంగా ఆందోళనతో ఉంటారు. కటుుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు.

    వృశ్చిక రాశి:
    మాటలను అదుపులో ఉంచుకోవాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

    ధనస్సు రాశి:
    కొన్ని విషయాలపై వ్యాపారులు ఇతరులతో వాగ్వాదం చేస్తారు. శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొంతుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

    మకర రాశి:
    ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు భవిష్యత్ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొత్త వ్యక్తులను కలుస్తారు.

    కుంభరాశి:
    జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో ఒకరి కోసం కష్టపడాల్సి వస్తుంది. ఏ పని మొదలుపెట్టినా త్వరగా పూర్తి చేయాలి. కొన్ని పనుల్లో స్నేహితుల సాయం ఉంటుంది.

    మీనరాశి:
    భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు అదనంగా ఖర్చులు ఉంటాయి. కొత్త పనిని ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి.