Ustad Bhagat Singh political drama: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar)…ఈయన పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) తో చేసిన గబ్బర్ సింగ్ (Gabbar Singh) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టినప్పటికి ఆశించిన మేరకు ఆయనకు గొప్ప పేరు అయితే రాలేకపోయింది. ఇక దాంతో ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల మీద చాలావరకు కసరత్తులైతే చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Usthad Bhagath Singh) సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను కమిట్ అయిన సినిమాలన్ని పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు. ఇక అందులో భాగంగానే హరీష్ శంకర్ సైతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేసిన కూడా హరీష్ శంకర్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ తో సినిమాలు చేస్తే ఆయన కున్న క్రేజ్ మరింత పెరుగుతుందని అతని అభిమానులైతే నమ్ముతున్నారు.
Also Read: బాలయ్య బాబు భారీ ఆశలు పెట్టుకున్న ఆ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయా..?
అయితే ఈ స్టోరీని హరీష్ శంకర్ దాదాపు మూడు సంవత్సరాల క్రితమే రాశాడు. ఇక ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా మారాడు. కాబట్టి కథని కూడా మార్చినట్టుగా తెలుస్తోంది. ఒక పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తోంది.
తద్వారా పవన్ కళ్యాణ్ కి గాని హరీష్ శంకర్ కి గాని ఎలాంటి ఇమేజ్ ను పాదించి పెడుతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక తను ఇంతకుముందు చేసిన మిస్టర్ బచ్చన్ (Mister Bachhan) సినిమా ఆశించిన మేరకు విజయన్నైతే సాధించలేదు. దాంతో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది…
Also Read: తన సినిమాల్లోని పాత బ్లాక్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేయబోతున్న చిరంజీవి..ఫ్యాన్స్ కి పండగే!
ఇక ఈ సంవత్సరంలోనే రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే సంవత్సరం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరి ఈ మూడు సినిమాలతో తను సినిమాలు చేయడం ఆపేస్తాడా? లేదంటే మరికొన్ని సినిమాలకు కమిట్ అవుతాడా? అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…