Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘విశ్వంభర'(Vishwambhara Movie) మూవీ కోసం అభిమానులు చాలా కాలం నుండి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. షూటింగ్ కార్యక్రమాలు కేవలం ఒక ఐటెం సాంగ్ మినహా మొత్తం పూర్తి అయ్యింది. ఐటెం సాంగ్ చిత్రీకరణ కోసం కొంతమంది స్టార్ హీరోయిన్లను సంప్రదించారు కానీ, చివరికి నాగిని సీరియల్ హీరోయిన్ మౌని రాయ్(Mouni Roy) ని ఎంచుకున్నారు. ఈమధ్య కాలం లో మౌని రాయ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉంది. బ్రహ్మాస్త్ర సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, రకరకాల క్యారెక్టర్స్ చేస్తూ బాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. యూత్ ఆడియన్స్ లో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ స్టార్ హీరోలకు కూడా ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు లో ఇప్పటి వరకు ఆమె ఎలాంటి సినిమాలో నటించలేదు.
Also Read: బాలయ్య బాబు భారీ ఆశలు పెట్టుకున్న ఆ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయా..?
‘విశ్వంభర’ చిత్రం తోనే ఆమె గ్రాండ్ గా మన ఇండస్ట్రీ లోకి లాంచ్ అవ్వబోతుంది. అయితే ఈ ఐటెం సాంగ్ మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ’ చిత్రం లోని ‘రగులుతుంది మొగలి పొగ’ పాటకు సంబంధించిన రీ మిక్స్ అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఒక తరం మొత్తాన్ని ఊపేసిన పాట అది. ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా ఆ పాటని ఉపయోగిస్తూ ఉంటారు. ఒక ట్రెండ్ సెట్ చేసిన పాటను మరోసారి రీమిక్స్ అంటే పెద్ద సాహసమే. చిరంజీవి అందుకు ఎలా ఒప్పుకున్నాడో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘రగులుతుంది మొగలి పొగ’ సాంగ్ లో చిరంజీవి,హీరోయిన్ మాధవి మధ్య వేరే లెవెల్ రొమాన్స్ ఉంటుంది. ఇప్పుడు రీమిక్స్ సాంగ్ లో కూడా అదే రేంజ్ రొమాన్స్ ని రిపీట్ చేయబోతున్నారా?, తన కూతురు వయస్సుతో సమానమైన మౌని రాయ్ తో చిరంజీవి అలా చేస్తే అభిమానులు తీసుకోగలరా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
Also Read: శ్రీకాంత్ ఓదెల చిరంజీవి కాంబోలో వచ్చే మూవీ స్టోరీ ఏంటో తెలుసా..?
ఇది పక్కన పెడితే డైరెక్టర్ వశిష్ఠ ఈ రీమిక్స్ పాటని రొమాంటిక్ పద్దతిలో కాకుండా, వేరే యాంగిల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే విలన్ గ్యాంగ్ తో కూడా హీరోయిన్ మౌని రాయ్ రొమాన్స్ చేస్తూ ఈ పాటని చేయొచ్చు. ఆ ఛాయస్ కూడా ఉంది, చూడాలి మరి డైరెక్టర్ ఎలా చూపించబోతున్నాడు అనేది. ఇకపోతే ఈ సినిమా విడుదలపై ఇంకా డైలమా వీడలేదు. దసరా సీజన్ ని వదలకూడదు,ఉపయోగించుకోవాలి అనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్. కానీ దసరా కి పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అన్ని ప్రాంతాల్లో బిజినెస్ క్లోజ్ అయ్యింది, మరో పక్క విశ్వంభర కి ఒక్క సెంటర్ లో కూడా బిజినెస్ పూర్తి కాలేదు. దీంతో ఈ చిత్రం అసలు ఈ ఏడాది లో విడుదల అవుతుందా అనే సందేహంలో ఉన్నారు ఫ్యాన్స్.