Harish Shankar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళ నుంచి వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాల వైపు ఎక్కువగా అడుగులు వేస్తుంటారు. కాబట్టి వాళ్లకి స్టార్ హీరోల నుంచి కూడా భారీ అవకాశాలైతే వస్తుంటాయి. ఇక హరీష్ శంకర్ లాంటి దర్శకుడు కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా కమర్షియల్ సినిమాలతో సూపర్ సక్సెస్ సాధించాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆయన అనుకున్న రేంజ్ లో సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు. రవితేజతో చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా భారీ డిజాస్టర్ ను మూట గట్టుకుంది. పవన్ కళ్యాణ్ తో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సైతం అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించలేదు. దాంతో ఆయన చాలావరకు డీలా పడిపోయాడు.
ఇక ప్రస్తుతం అతనికి అవకాశాలను ఇచ్చే హీరోలు కూడా కరువైపోయారు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం హరీష్ శంకర్ ని చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈయన మరో మెహర్ రమేష్ అవుతాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఆయన ఇచ్చే ఇంటర్వ్యూల్లో చాలా ఓవర్గా మాట్లాడతాడని తను తీసే సినిమాలకు తను మాట్లాడుతాడే మాటలకు సంబంధం ఉండదని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక తన తదుపరి సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటే తప్ప ప్రేక్షకుల నుంచి అతనికి ఆదరణ లభించదు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ డైరెక్టర్ గా నిల్చోబెట్టాయి.
కాబట్టి ఇక మీదట కూడా ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటే అతను మరోసారి తన సత్తా చాటుకున్న వాడు అవుతాడు. లేకపోతే మాత్రం భారీగా డీలా పడిపోవాల్సిన ప్రమాదమైతే ఏర్పడనుంది… ఆయన అనుకున్నట్టుగా ఒక మంచి కథ రాసుకొని సినిమా చేసి సక్సెస్ ను సాధిస్తే మాత్రం మరోసారి పెద్ద హీరోల నుంచి అతనికి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది…