Harish Shankar apology to Mahesh Babu: మరో 8 రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం విడుదల కాబోతున్న ఈ నేపథ్యం లో, సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. అభిమానులు ఒక పక్క ఈ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తుంటే, ఇతరులు ఈ చిత్రం లోని కంటెంట్ ని ఎదో విధంగా వాడుకుంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఒక ప్రభాస్ అభిమాని నిన్న విడుదలైన ‘కాలరే ఎత్తరా’ ప్రోమో ని షేర్ చేస్తూ, మహేష్ బాబు ట్రోల్ వేస్తూ, ‘లేపరా.. లేపరా..మహేష్ బాబు క్లోజింగ్ కలెక్షన్స్ ని మరోసారి లేపరా’ అంటూ పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్స్ ఇచ్చాడు. దీనిని చూసిన హరీష్ శంకర్ ‘తథాస్తు’ అని రిప్లై ఇచ్చాడు. దీనికి మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సినీ ఇండస్ట్రీ లో ఉంటూ , అవతల హీరోలపై ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తావు అంటూ ఆయన్ని ఏకిపాడేశారు.
హరీష్ శంకర్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కాసేపటి క్రితమే దీనిపై స్పందించిన హరీష్ శంకర్ , సమాధానం చెప్తూ ‘నిన్న నాకు చాలా బిజీ డే. సెన్సార్ బోర్డు అధికారులతో మీటింగ్, ఆ తర్వాత పెద్దమ్మ తల్లి దేవాలయం కి వెళ్లి ఆశీస్సులు తీసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యాను. నిన్న విడుదల చేయబోయే ప్రోమో సాంగ్ కి ఫైనల్ చెక్ చేసిన తర్వాత విడుదల చేసి, ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొని తమన్ గారి స్టూడియో కి వెళ్లాను. ఈ సమయం లో నేను కొంతమంది జర్నలిస్టులకు, నా శ్రేయోభిలాషులకు రిప్లై ఇస్తున్నాను. ఆ హడావడిలో ఒక ట్వీట్ ని పూర్తిగా చూడకుండా క్వాట్ చేయాల్సి వచ్చింది. ఆ ట్వీట్ ఉద్దేశ్యం నాకు అప్పుడు తెలియదు. ఆ తర్వాత తెలుసుకున్నాను, వెంటనే తొలగించాను ‘.
Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ మీద నెగెటివ్ ప్రచారం చేస్తున్నదెవరు..?
‘నాకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంటే ఎంతో గౌరవం ఉంది. అందరి లాగానే ఆయన తదుపరి చిత్రం ‘వారణాసి ‘ వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. నిన్న పొరపాటున వేసిన ట్వీట్ అభిమానులకు బాధ కలిగించి ఉండుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే అభిమానులతో పాటు, ఇతర హీరోల అభిమానుల సపోర్టు కూడా ఉండాలి. పది రోజుల్లో సినిమాని విడుదల పెట్టుకొని కామన్ సెన్స్ లేకుండా అలా ఒక హీరోని కించపరచాలని ఎందుకు అనుకుంటాను చెప్పండి ?, దయచేసి నా క్షమాపణలు మన్నించండి, ఎప్పటి లాగానే మా సినిమాకు సపోర్టు చేయండి ‘ అంటూ చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్.
