Hari Hara Veeramallu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan kalyan) కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు తెలుగులో చాలా మంది అభిమానులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఆయన ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినప్పటికి ఆయనకు ఇండియాలో సైతం మంచి గుర్తింపైతే ఉంది. మరి తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోలలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు అవుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. కాబట్టి సినిమాల మీద పెద్దగా ఫోకస్ అయితే చేయడం లేదు. ఇక ఇంతకుముందు కమిట్ అయిన సినిమాలను సూపర్ సక్సెస్ లుగా నిలవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఈ సినిమా షూటింగ్ లకు కూడా తను ప్రస్తుతం హాజరుకాలేని పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్లే వరుస సినిమాలను డేట్స్ అనౌన్స్ చేస్తూ వాయిదా వేస్తూ వస్తున్నారు. దాంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద క్లారిటీ లేకుండా పోతుంది.
Also Read : అభిమానులను పిచ్చెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ టీం మౌనం..అసలు ఏమి జరుగుతుంది?
ఇక ఇలాంటి సందర్భంలోనే క్రిష్ డైరెక్షన్ లోనే గత నాలుగు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ‘హరిహర వీరామల్లు'(Hari Hara Veeramallu) సినిమా వరకు రిలీజ్ కి నోచుకోలేదు. ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 11 సార్లు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేశారు. మరి ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎందుకని అలా చేస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే క్రిష్ తప్పుకున్నారు. ఆయన ప్లేస్ లో ఏ ఏం రత్నం కొడుకు అయిన జ్యోతి కృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెరకెక్కిస్తున్నప్పటికి ఈ సినిమాని రిలీజ్ చేయడంలో మాత్రం చాలా వరకు ఆలస్యం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఆయన తనకు సంబంధించిన డేట్స్ ఇస్తూ మళ్లీ క్యాన్సిల్ చేస్తూ వస్తున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలో ఒక సినిమాకు సంబంధించిన పూర్తి నిబద్ధతతో ఉంటూ సినిమాను కంప్లీట్ చేసి అప్పుడు ఆయన పాలిటిక్స్ లో బిజీ అయిపోతే బాగుంటుంది అని తమ అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఈసారి కనక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేస్తే మాత్రం ఈ సినిమా మీద భారీ బజ్ అయితే ఉండకపోగా నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
Also Read : హరి హర వీరమల్లు’ కి హాలీవుడ్ హీరో ‘టామ్ క్రూజ్’ గండం..ఇలా అయితే కష్టమే!