Pawan Kalyan HHVM press meet: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ని మన రాజకీయ సభల్లో చూసి ఉంటాము, రాజకీయానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ లో కూడా చూసి ఉంటాము , కానీ సినిమాలకు సంబంధించి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తప్ప ఎక్కువగా ఎక్కడ కనిపించడు. ఇంటర్వ్యూస్ కూడా చాలా అంటే చాలా అరుదుగా ఇస్తూ ఉంటాడు. అలాంటిది ఆయన మొట్టమొదటిసారి ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ కోసం ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. కాసేపటి క్రితమే ఆయన ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత మీడియా ఇంటరాక్షన్ ఉంటుందని అంతా అనుకున్నారు కానీ, హడావడిగా వెళ్ళిపోయాడు. రాబోయే రెండు మూడు రోజుల్లో కచ్చితంగా ఇంటర్వ్యూస్ ఇస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.
Also Read: సితార బర్త్ డే వేళ మహేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్… ఆ సీక్రెట్ బయటపెట్టిన సూపర్ స్టార్
ఇంతకు ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడుతూ ‘పొలిటికల్ మీటింగ్స్ లో మాట్లాడడం నాకు అలవాటు. పోడియం ఉండేది, ఇప్పుడు పోడియం లేకుండా మాట్లాడుతుంటే నగ్నంగా మాట్లాడుతున్నట్టు ఉంది. సాధారణంగా నాకు నా సినిమాలను ప్రమోట్ చేసుకోవడం ఎలాగో తెలియదు. పొగరుతో నేను ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదని అనుకోకండి, నాకు సినిమా గురించి ఏమి మాట్లాడాలో తెలియదు కాబట్టే ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు. కానీ ఈ సినిమాకు ఎందుకో రత్నం గారు నలిగిపోతుండడం చూసి చివరి నిమిషం లో నేను అడుగుపెట్టాల్సి వచ్చింది. కేవలం ఆయన కోసం మాత్రమే ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశాను. రత్నం గారు ఎలాంటి వ్యక్తి అనేది నాకు తెలుసు. ఒకప్పుడు స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి క్యూలు కట్టేవారు. కానీ ఇప్పుడు ఆయన అంతలా ఇబ్బంది పడడం నాకు బాధ వేసింది. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం, తపన మామూలుది కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: ’హరిహర వీరమల్లు’ పై ఎందుకింత నెగెటివిటీ?
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా ప్రొమోషన్స్ మొత్తం ఈ నిధి అగర్వాల్ అనే అమ్మాయి తన భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేయడం చూసి నాకు నామీదనే సిగ్గు వేసింది. అందరు ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు. రత్నం గారు, మనోజ్ గారు, జ్యోతి కృష్ణ నిద్రాహారాలు మానేసి మరి పనిచేస్తున్నారు. దీంతో ప్రొమోషన్స్ లేకుండా ఈ సినిమాని అనాధని చేసేసారు అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఈ సినిమాకు బలమైన బేస్మెంట్ వేసింది డైరెక్టర్ క్రిష్ గారు. ఈరోజు ఆయన ఈ సినిమా నుండి కొన్ని కమిట్మెంట్స్ కారణంగా తప్పుకొని ఉండొచ్చు కానీ, ఆయనకు నేను మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇక సాయంత్రం జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏమి మాట్లాడుతాడో చూడాలి.
