Hari Hara Veeramallu Movie : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie). ఎప్పుడో 2021 వ సంవత్సరం లో మొదలైన సినిమా ఇది. ఈ చిత్రం లో చైల్డ్ ఆర్టిస్టు గా నటించిన ఒక చిన్నారి ఇప్పుడు హీరోయిన్ అయ్యే రేంజ్ కి ఎదిగిపోయింది. ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), కేవలం 70 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి చేసి, ఆ సినిమా నుండి తప్పుకున్న పరిస్థితి. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ మిగిలిన భాగానికి దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయినట్టే. కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. అసెంబ్లీ సమావేశాలు పూర్తి అవ్వగానే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడట. ఈ నెలాఖరు లోపు షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
Also Read : ‘హరి హర వీరమల్లు’ అధికారికంగా వాయిదా పడినట్టే..ఖరారు చేసిన నిర్మాత..మరి విడుదల అయ్యేది ఎప్పుడు?
వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ నెల 28వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని మేకర్స్ ముందుగా అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ బిజీ కారణంగా డేట్స్ కేటాయించకపోవడం వల్ల, షూటింగ్ ఆలస్యమైంది, సినిమా కూడా వాయిదా పడింది. మార్చి 28న సినిమా విడుదల అవుతుందని అనుకుంటే, అప్పటికి సినిమా పూర్తి అయ్యే పరిస్థితులు ప్రస్తుతానికి ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి నిర్మాత ఏఎం రత్నం డబ్బులను మంచి నీళ్లు లాగా ఖర్చు చేసాడు అని చెప్తే అతిశయోక్తి కాదేమో. ఈ సినిమాలో వజ్రాన్ని దొంగిలించే సన్నివేశం ఒకటి ఉంటుంది. సాధారణంగా ఎవరైనా డూప్లికేట్ వజ్రం తో షూటింగ్ చేస్తారు. కానీ ఏఏం రత్నం మాత్రం నిజమైన వజ్రం తో షూటింగ్ చేశాడట. అదే విధంగా హీరోయిన్ నిధి అగర్వాల్ ధరించిన నగలన్నీ కూడా నిజమైనవే అట.
అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమాకి ఆయన పెట్టిన బుడ్జెగ్త 300 కోట్ల రూపాయిలు దాటిందని సమాచారం. విడుదలకు ముందే ఈ సినిమా 350 కోట్ల రూపాయిల బిజినెస్ ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. థియేట్రికల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి 250 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట. అదే విధంగా డిజిటల్ రైట్స్ 120 కోట్లు, సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ కలిపి మరో 60 కోట్లు, మొత్తం మీద ఈ సినిమాకి 350 కోట్ల రూపాయలకు పైగానే జరిగిందని సమాచారం. ఇక థియేట్రికల్ వెర్షన్ నుండి బయ్యర్స్ కి లాభాలు రావాలంటే కచ్చితంగా 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది. టాక్ వస్తే చాలా తేలికగా వస్తుంది కానీ, ఈ సినిమాకి కావాల్సిన హైప్ మాత్రం ఇంకా ఏర్పాటు కాలేదు. వచ్చే వారం లో ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారట.