IND vs NZ : దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో (IND vs NZ) భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు రెడీ అయింది. మరికొద్ది చాలా లో ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. 2017లో పాకిస్తాన్ చేతిలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన నేపథ్యంలో.. ఈసారి ఎలాగైనా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోకూడదని.. ట్రోఫీని దక్కించుకోవాలని టీమ్ ఇండియా భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఫైనల్ ఆడే జట్టు విషయంలో మేనేజ్మెంట్ స్వల్ప మార్పులు చేసినట్టు తెలుస్తోంది.
Also Read : భారత్ – న్యూజిలాండ్ మధ్య నేడు CT ఫైనల్..బెట్టింగ్ ఎన్ని వేల కోట్లో తెలుసా?
ఫైనల్ మ్యాచ్ ముందు విరాట్ కోహ్లీ శనివారం ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి గాయం అయినట్టు తెలిసింది. అయితే వెంటనే జట్టు ఫిజియోలు వచ్చి విరాట్ కోహ్లీ మోకాలికి గాయం అయినచోట స్ప్రే వాడారు. బ్యాండేజ్ చుట్టారు. ఆ తర్వాత విరాట్ వచ్చి ప్రాక్టీస్ చేశాడు. ఫైనల్ మ్యాచ్ కు అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యంతో ఉన్నాడని జట్టు మేనేజ్మెంట్ వెల్లడించింది.. ఈ క్రమంలో గిల్ తో కలిసి రోహిత్ శర్మ టీమిండియా ఇన్నింగ్స్ మొదలు పెడతాడు. విరాట్ కోహ్లీ వన్ డౌన్ లో వస్తాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఆ తర్వాత బ్యాటింగ్ చేయడానికి వస్తారు. వీరి విషయంలో ఎటువంటి మార్పులు చేపట్టడానికి టీమిండియా మేనేజ్మెంట్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ బ్యాటింగ్ ఆర్డర్ లోనే టీమిండియా విజయాలు సాధించింది.
బలంగా స్పిన్ బౌలింగ్
టీమిండియా కు స్పిన్ బౌలర్లు అత్యంత బలంగా మారారు. ప్రస్తుతం భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారు. ఫైనల్ మ్యాచ్లో అందులో నలుగురికి అవకాశం లభిస్తుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్లలో టీమిండియా ఇదే ఫార్ములా ప్రయోగించింది.. ఇప్పుడు కూడా అదే నమూనా కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఇందులో ఒక్క మార్పు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ ను మరింత బలోపేతం చేయడానికి మేనేజ్మెంట్ కులదీప్ యాదవ్ స్థానంలో కుడి చేతివాటం స్పిన్నర్ ను జట్టులోకి తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే కులదీప్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వస్తాడని తెలుస్తోంది. కులదీప్ యాదవ్ గత రెండు మ్యాచ్లలో 17.3 ఓవర్ల పాటు బౌలింగ్ వేసి, 100 పరుగులు ఇచ్చి, రెండు వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ కావడంతో అతడిని పక్కనపెట్టి సుందర్ ను జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. సుందర్ కు న్యూజిలాండ్ జట్టు మీద మెరుగైన రికార్డు ఉంది. సుందర్ ను కనుక జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్ ఆధర్ బలపితం అవుతుందని మేనేజ్మెంట్ భావిస్తుంది. దుబాయ్ మైదానం స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తున్న నేపథ్యంలో బ్యాటింగ్ కూడా అత్యంత కీలకం కానుంది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తో స్పిన్ బౌలింగ్ దళం బలంగా ఉంది. అలాంటప్పుడు బౌలింగ్ తో పాటు, బ్యాటింగ్ చేసే వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వస్తే టీమిండియా మరింత బలోపేతం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తుది జట్టు విషయంలో మేనేజ్మెంట్ ఇప్పటికీ గోప్యత పాటిస్తూనే ఉంది. ” వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్ జట్టుపై మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్ లోనూ అతడికి గొప్ప రికార్డులు ఉన్నాయి. అలాంటప్పుడు అతడిని జట్టులోకి తీసుకుంటేనే బాగుంటుంది. అతడు గనుక ఫైనల్ మ్యాచ్లో అవకాశం దక్కించుకొని.. దానిని సద్వినియోగం చేసుకుంటే.. అతడి కెరియర్ మరోవైపు టర్న్ తీసుకుంటుందని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read : మైదానంలో టీమిండియా మీద గెలవలేరు..ఫైనల్ లో మాత్రం కివీస్ కు సపోర్టు.. ఏం బతుకులు రా మీవి?!