Hari Hara Veeramallu First Day Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం భారీ అంచానాలు నడుమ నేడు విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా కలెక్షన్స్ ని ప్రీమియర్ షోస్ మాత్రమే కాపాడాయని చెప్పొచ్చు. నిన్న రాత్రి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ వేశారు. కలెక్షన్స్ అన్ని ప్రాంతాల్లోనూ రికార్డు బ్రేకింగ్ రేంజ్ లో వచ్చాయి. కానీ ఆ ప్రీమియర్స్ నుండి వచ్చిన నెగటివ్ టాక్, రెగ్యులర్ షోస్ మీద చాలా బలమైన ప్రభావం పడింది. మార్నింగ్ షోస్, నూన్ షోస్ వరకు పర్వాలేదు అనిపించింది కానీ, ఆ తర్వాత మాట్నీ షోస్ మాత్రం బాగా పడిపోయాయి. మళ్ళీ ఫస్ట్ షోస్ నుండి ప్రధాన నగరాల్లో వసూళ్లు పుంజుకున్నాయి కానీ, ఆశించిన స్థాయిలో అయితే పుంజుకోలేదు.
పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘బ్రో’ కి ఇంతకంటే భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. బుక్ మై షో యాప్ గణాంకాల ప్రకారం మొదటి రోజు ఈ చిత్రానికి రెండు లక్షల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు పది వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. నిన్న రాత్రి వేసిన ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ప్రీమియర్ షోస్+ మొదటి రోజు కలిపి వరల్డ్ వైడ్ గా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ స్టామినా కారణంగా వచ్చింది కానీ, మొదటి నుండి ఈ సినిమాకు జనాల్లో హైప్ ఫ్యాక్టర్ అసలు లేదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు 70 నుండి 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
Also Read: ఎపిక్ డిజాస్టర్.. బుక్ మై షో లో దయనీయమైన స్థితిలో ‘హరి హర వీరమల్లు’!
పవన్ కళ్యాణ్ తోటి స్టార్ హీరోలు ప్రస్తుతం ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే రేంజ్ గ్రాస్ ని రాబడుతాడని అంతా అనుకున్నారు. కానీ సినిమాకు ఘోరమైన నెగటివ్ టాక్ రావడం వల్ల అది జరగలేదు. దీంతో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్(Global Star Ram Charan) ‘గేమ్ చేంజర్'(Game changer) చిత్రం కంటే తక్కువ ఓపెనింగ్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. గేమ్ చేంజర్ చిత్రానికి మొదటి రోజు 86 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఈ చిత్రమే ఈ ఏడాది టాప్ స్థానం లో నిలిచే అవకాశాలు ఉన్నాయి. రామ్ చరణ్ తన కెరీర్ మొత్తం మీద పవన్ కళ్యాణ్ పై ఎక్కువ ఓపెనింగ్స్ వసూళ్లను రాబట్టడం ఇదే తొలిసారి అనొచ్చు.