Hari Hara Veeramallu Bookings Dropped: భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం నిన్నటి ప్రీమియర్ షోస్ నుండే అభిమానుల నుండి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా కంటెంట్ ఒక మాదిరిగా ఉన్నప్పటికీ VFX కంటెంట్ అత్యంత దారుణంగా ఉండడం తో అభిమానుల నుండే చీవాట్లను సొంతం చేసుకుంది ఈ చిత్రం. చాలా కాలం తర్వాత పవన్ సినిమాని వెండితెర పై చూసుకోవచ్చు అనే ఆనందంతో థియేటర్ కి వచ్చిన అభిమానులకు ఈ సినిమా ఇచ్చిన స్ట్రోక్ మామూలుది కాదు. చిన్న చిన్న చిత్రాలు కూడా క్వాలిటీ VFX తో మన ముందుకు వస్తున్న ఈ రోజుల్లో, 250 కోట్ల బడ్జెట్ అంటూ డప్పు కొట్టుకొని వచ్చిన ‘హరి హర వీరమల్లు’ VFX కనీస స్థాయిలో కూడా లేకపోవడం అభిమానులకు మింగుడుపడని విషయం.
ఇక ఈ సినిమాకు వచ్చిన నెగటివ్ టాక్ తాలూకు ప్రభావం టికెట్ సేల్స్ పై చాలా బలమైన ప్రభావం పడింది. బుక్ మై షో యాప్ లో ఇప్పటి వరకు ఈ చిత్రం మొదటి రోజున గంటకు 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోలేదు. ఈరోజు ఉదయం పది గంటల సమయం లో గంటకు 18 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. పర్లేదు, ఈ టాక్ మీద బానే నిలబడింది అని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా క్రిందకి పడిపోతూ వచ్చింది. ఇప్పుడు గంటకు 9 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ధనుష్ ‘కుబేర’ చిత్రం మొదటి రోజు కంటే తక్కువ ఇది. ఇంత దారుణంగా మొదటి రోజు ఒక స్టార్ హీరో సినిమా పడిపోవడం ఈమధ్య కాలం లో ఎప్పుడు చూడలేదు. దీనిని బట్టీ టాక్ ఏ రేంజ్ లో వ్యాప్తి చెందిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: దిల్ రాజు భార్య డాన్స్ అద్భుతంగా చేస్తోందిగా…వైరల్ వీడియో…
ఇంతటి దారుణమైన ఫలితాన్ని అందుకున్న ఈ చిత్రానికి మరి కాసేపట్లో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నాడట. ఆయన ఒక సినిమాకు ప్రొమోషన్స్ చేయడం మనం ఇన్నేళ్ళలో చాలా తక్కువసార్లు చూసి ఉంటాము. అలాంటిది ఈ సినిమా కోసం ఆయన కష్టపడి మరీ ప్రమోట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక మంచి సినిమాని తన భుజాన వేసుకొని ప్రమోట్ చేసి ఉండుంటే అభిమానులు కచ్చితంగా సంతోషించి ఉండేవారు. కానీ ఒక ఫ్లాప్ సినిమాని బాగుంది, సూపర్ హిట్ అయ్యింది, అందరూ చూడండి అంటూ పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తి చెప్పడం రియాలిటీ కి చాలా దూరంగా అనిపిస్తుంది.