Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమా విడుదలకు దగ్గర పడుతుండడంతో ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. మూడు వారాల క్రితం ‘మాట వినాలి’ అనే పాటను విడుదల చేసిన మూవీ, ఈ నెల 24 వ తేదీన ‘కొల్లగొట్టినాదిరో’ అనే పాటని విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు మూవీ టీం ఒక పోస్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్(Nidhi Agarwal) లుక్స్ ని చూసి అభిమానులు చాలా సంతోషించారు. కానీ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ ఇవ్వకపోవడంపై చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయబోతున్నట్టు చాలా కాలం క్రితమే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నేడు విడుదల చేసిన పోస్టర్ లో కూడా అదే విడుదల తేదీ ఉంది.
ఇప్పటి నుండి లెక్కేస్తే సరిగ్గా 42 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయం లో అప్డేట్స్ చాలా ఆలస్యంగా వస్తున్నాయని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల దగ్గర్లో ఉన్నప్పుడు ఇంత ఆలస్యంగా అప్డేట్స్ రావడం ఎప్పుడూ చూడలేదని, ఇలాంటి గ్రాండ్ స్కేల్ ఉన్న సినిమాలకు పాటలకంటే ఎక్కువగా సినిమా కంటెంట్ ని జనాలకు తెలిసేలా మేకింగ్ వీడియో లాంటివి విడుదల చేయాలని, చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాని సరిగా ప్రమోట్ చేయలేకపోతున్నారని అభిమానులు వాపోతున్నారు. అసలు ఈ చిత్రం మార్చి 28 న వస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ కి నిర్మాత ఏఎం రత్నం ఇప్పటి వరకు ఖరారు చేసి చెప్పలేదట. ఆ తేదీన విడుదల చేయడానికి ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం అని అంటున్నాడే కానీ, కచ్చితంగా వస్తుందని మాత్రం చెప్పట్లేదు. ఒకవేళ వాయిదా వేసే పని అయితే ఏప్రిల్ 10 లేదా ఏప్రిల్ 17 కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది.
నిజంగా ఈ సినిమాని వాయిదా వేసే ఆలోచనే ఉంటే, ముందుగానే ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన చేయడం మానేసి, విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేకుండా వరుసపెట్టి సాంగ్స్ ని రిలీజ్ చేసుకుంటూ పోతే విడుదల సమయానికి ఏ ప్రమోషనల్ కంటెంట్ కూడా మిగలదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ నెల రోజుల ముందే ప్రారంభిస్తారు. ‘హరి హర వీరమల్లు’ ఒకవేళ మార్చి 28న రాకపోయినా ఏప్రిల్ లో విడుదల అవుతుంది అంటున్నారు కాబట్టి, నెల రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించాల్సి ఉండడం తో మార్చి 11 లోపు విడుదల తేదీ విషయంలో క్లారిటీ రావాలని, లేకపోతే మీ ఆఫీస్ ముందుకొచ్చి ధర్నా చేస్తామంటూ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.