Hari Hara Veeramallu advance bookings : చాలా కాలం గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) నుండి విడుదల అవ్వబోతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). ఎన్నో ఒడిదుడుగల మధ్య షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నిన్ననే ప్రారంభించారు. బుకింగ్స్ మొదలు పెట్టి అమెరికా లో ఇంకా 24 గంటలు కూడా గడవలేదు. అప్పుడే ఈ చిత్రం రికార్డ్స్ వేట మొదలు పెట్టింది. కేవలం 12 గంటల్లోనే ఈ చిత్రానికి 30 వేల అమెరికన్ డాలర్లు వచ్చినట్టు ఆ చిత్రం డిస్ట్రిబ్యూటర్ నిన్న అధికారిక ప్రకటన చేసాడు. ఆయన ఆ ప్రకటన చేసిన తర్వాత అనేక షోస్ షెడ్యూల్ అయ్యాయి. గ్రాస్ వసూళ్లు ఇంకా పెరిగాయి. బుకింగ్స్ మొదలు పెట్టి మొదటి రోజు పూర్తి అయ్యే సమయానికి ఈ చిత్రం 60 వేల డాలర్ల మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇది ఆల్ టైం టాప్ 3 రికార్డు గా భావించవచ్చు. రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ సినిమాల్లో బుకింగ్స్ మొదలు పెట్టిన మొదటి రోజు అత్యధిక గ్రాస్ ని నమోదు చేసుకున్న చిత్రాల లిస్ట్ తీస్తే ‘కల్కి 2898 AD’ చిత్రం మొదటి స్థానం లో ఉంటుంది. ఈ చిత్రానికి బుకింగ్స్ మొదలు పెట్టిన మొదటి రోజు దాదాపుగా లక్షా 30 వేల డాలర్లు వచ్చాయి. ఇక ఆ తర్వాతి స్థానం లో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం నిల్చింది. ఈ సినిమాకు బుకింగ్స్ మొదలు పెట్టిన మొదటి రోజు 75 వేల డాలర్లు రాగా, ‘హరి హర వీరమల్లు’ చిత్రం 60 వేల డాలర్లతో మూడవ స్థానం లో నిల్చింది. వాస్తవానికి ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఆల్ టైం రికార్డు గ్రాస్ నమోదు అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరగాలంటే కచ్చితంగా థియేట్రికల్ ట్రైలర్ ఉండాలి.
Also Read : మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?
కనీసం ఒక్క చార్ట్ బస్టర్ సాంగ్ అయినా ఉండాలి. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి అవే కొరవడ్డాయి. మొన్న విడుదలైన మూడవ పాట మినహా, అంతకు ముందు విడుదల చేసిన రెండు పాటలకు యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. కేవలం పవన్ కళ్యాణ్ పేరు మీద మాత్రమే ఈ రేంజ్ టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక ‘హరి హర వీరమల్లు’ తర్వాతి స్థానం లో 52 వేల రూపాయిల గ్రాస్ మార్కు తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం నిల్చింది. ఇక ఆ తర్వాత 24 వేల డాలర్ల గ్రాస్ తో ‘గుంటూరు కారం’ చిత్రం 5 వ స్థానం లోనూ, 22 వేల గ్రాస్ డాలర్స్ తో ‘గేమ్ చేంజర్’ చిత్రం ఆరవ స్థానంలోనూ నిలిచాయి.