Hari Hara Veeramallu New Release : అన్నీ అనుకున్న విధంగా జరిగి ఉండుంటే మరో వారం రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ని అభిమానులు వెండితెర మీద చూసేవారు. ఆయన హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఎన్నో అడ్డంకులను దాటుకొని జూన్ 12 న విడుదల అవ్వడానికి సిద్ధం అయ్యింది. జూన్ 3 న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి కాపీ ని సెన్సార్ కార్యక్రమాలకు కూడా పంపించారు. కానీ ఇరాన్ నుండి అప్పుడే ఫోన్ కాల్ వచ్చింది. సెకండ్ హాఫ్ కి సంబంధించిన VFX వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉందని. రెండరింగ్ సమస్యలు ఉన్నాయని, మరో వారం రోజుల సమయం పట్టేలా ఉందని చెప్పడం తో అప్పటికప్పుడు సినిమాని వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. పాపం అభిమానులు అప్పటికే రాష్ట్రంలో ప్రతీ చోట బ్యానర్స్ ని ఏర్పాటు చేసుకున్నారు.
కొన్ని చోట్ల థియేటర్స్ ముందు బ్యానర్స్ కూడా కట్టేశారు. భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకోవడానికి డబ్బులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ చివరికి ఈ చిత్రం వాయిదా పడింది అనే విషయం తెలిసేసరికి వాళ్లకు గుండెలు ఆగినంత పని అయ్యింది. మరి కొత్త విడుదల తేదీ ఎప్పుడు ?, అసలు ఈ సినిమాని ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది అనే దానిపై ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ నెల 12 లోపు కొత్త విడుదల తేదీని ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇరాన్ నుండి రావాల్సిన VFX వర్క్ మొత్తం జూన్ 10న వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఆ వర్క్ వస్తే సినిమా మొత్తం పూర్తి అయిపోయినట్టే. అదేరోజున థియేట్రికల్ ట్రైలర్ ని కూడా కట్ చేస్తారట. ప్రస్తుతం నిర్మాత AM రత్నం మదిలో రెండు విడుదల తేదీలు ఉన్నాయి. కానీ బయ్యర్స్ మాత్రం మరో విడుదల తేదీని ప్రకటించామని ఒత్తిడి చేస్తున్నారు.
Also Read : ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం..ఫ్యాన్స్ సహనానికి పరీక్ష!
ఈ నెల 26 న విడుదల చేయాలి అనేది నిర్మాత AM రత్నం మనసులో ఉంది. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ తో పెట్టుకున్న డీల్ ప్రకారం ఈ నెలలోనే విడుదల చేయాలి. కానీ జూన్ 27 న ‘కన్నప్ప’ చిత్రం విడుదల కాబోతుంది. వాళ్ళతో నిర్మాత సంప్రదించగా వాయిదా వేయడం కష్టమే అని చెప్పారట. ఎందుకంటే ఆ తేదీని దాటితే తాము కోట్ల రూపాయల్లో నష్టపోతామని , అనుగుణంగా మరో విడుదల తేదీ కూడా దగ్గర్లో లేదని అంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రం జులై 4 న విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయట. ఎందుకంటే చాలా వరకు వర్క్ బ్యాలన్స్ ఉందట. కన్నప్ప టీం ఆ తేదీన తమ సినిమాని విడుదల చేసుకోవచ్చు. వాళ్ళు కుదరదు అని మొండిపట్టు పడితే హరి హర వీరమల్లు టీం అమెజాన్ ప్రైమ్ సంస్థ తో మాట్లాడి జులై నాల్గవ తేదీన విడుదల చేసే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రెండు తేదీలలోనే ‘హరి హర వీరమల్లు’ చిత్రం రానుంది.