Hari Hara Veeramallu Trailor : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వచ్చే నెల 12 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. సినిమా విడుదలకు సరిగ్గా 13 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇప్పటి వరకు థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాలేదు. అసలు ఇప్పటి వరకు ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఎలా ఉంటాయి?, అసలు సినిమా ఎలా ఉండబోతుంది అనే ఐడియా అభిమానులకు, ప్రేక్షకులకు రాలేదు. ట్రైలర్ విడుదల కాకపోతే ఓవర్సీస్ లో టికెట్స్ అమ్ముడుపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ చిత్రానికి ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. కారణం ఏమిటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అనేక సార్లు షూటింగ్ వాయిదా పడడమే ఈ సినిమా కి క్రేజ్ తగ్గడానికి కారణం అని చెప్పొచ్చు.
Also Read : అల్లు అర్జున్ ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే ఎప్పుడో స్టార్ హీరో అయ్యేవాడా..?
ఎంతటి పవర్ స్టార్ అయినా 5 ఏళ్ళ క్రితం మొదలైన ఒక సినిమా ని ఇంత సాగదీస్తే ఆడియన్స్ ఆ చిత్రం పై నమ్మకం పెట్టడం అంత తేలికైన పని కాదు కదా. అభిమానులకు కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం లేదు. ఈ చిత్రం మీద పచ్చిగా చెప్పాలంటే వాళ్ళు ఆశలు వదిలేసుకున్నారు. ఎందుకంటే మరో మూడు నెలల్లో వాళ్లకు అత్యంత క్రేజీ చిత్రం ఓజీ విడుదల అవుతుంది కాబట్టి. ఈ సినిమా కాకపోతే ఆ సినిమాతో భారీ గా కొడుతాం అనే నమ్మకం తో ఉన్నారు. ‘హరి హర వీరమల్లు’ అని అభిమానులు అంత తేలికగా తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని మార్చాలంటే థియేట్రికల్ ట్రైలర్ రావాల్సిందే. పీరియడ్ జానర్ లో తెరకెక్కించిన సినిమాలకు కేవలం ట్రైలర్ కంటెంట్ మాత్రమే హైప్ తీసుకొని రాగలదు.
పాటలు ఏ మాత్రం ప్రభావం కూడా చూపించలేవు, బాహుబలి చిత్రానికే పాటలు విడుదలకు ముందు వర్కౌట్ అవ్వలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ విడుదలైతే అభిమానుల్లో సినిమా మీద ఒక నమ్మకం కలుగుతుంది. ఇక సాధారణ ప్రేక్షకులు కూడా పర్లేదు ఈ చిత్రం లో ఎదో ఉంది అనే నమ్మకంతో టికెట్ బుక్ చేసుకుంటాడు. కానీ ఈ సినిమాకి అది జరగడం లేదు. ముందు మే 28 న ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ వినిపించింది. ఆ తర్వాత జూన్ 2న విడుదల చేస్తారని అన్నారు. కానీ ఇప్పుడు జూన్ 2 కూడా ట్రైలర్ వచ్చే అవకాశాలు లేవట. జూన్ 4వ తేదీన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట. అంటే సినిమా విడుదలకు సరిగ్గా వారం రోజుల సమయం అన్నమాట. నిర్మాతలు చేస్తున్న ఈ జాప్యం పై సోషల్ మీడియా లో అభిమానులు తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు.