Hari Hara Veera Mallu producer health Issue : నేడు ఉదయం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) నిర్మాత AM రత్నం(AM Ratnam) కి హై బీపీ వచ్చిందని, దీంతో వెంటనే ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడని సోషల్ మీడియా లో ఒక వార్త హల్చల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వార్త వైల్డ్ ఫైర్ లాగా సోషల్ మీడియా లో వ్యాప్తి చెందడంతో ‘హరి హర వీరమల్లు’ టీం ట్విట్టర్ ద్వారా వెంటనే స్పందించింది. సోషల్ మీడియా లో నేడు ఉదయం నుండి AM రత్నం గారి ఆరోగ్యం పట్ల ప్రచారం లో ఉన్న వార్త పూర్తిగా అవాస్తవం. ఆయన క్షేమంగా ఉన్నారు. ఇలాంటి సమయం లో ఆధారం లేని వార్తలను వ్యాప్తి చేసి లేని పోనీ డిస్టర్బన్స్ క్రియేట్ చేయొద్దు అంటూ స్పందించారు. కాసేపటి క్రితమే వేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
అసలు ఈ వార్త ఎక్కడి నుండి ఎలా వచ్చిందో కనిపెట్టలేకపోతున్నారు పవన్ ఫ్యాన్స్. ట్విట్టర్ లో ఒక పాపులర్ హ్యాండిల్ ఈ వార్త వేయడం తో అది బాగా వ్యాప్తి చెందింది. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ ఆ హ్యాండిల్ పై ఫైర్ అయ్యారు. దీంతో వెంటనే ఆ హ్యాండిల్ ట్వీట్ ని తొలగించి నేను వేరే చోట చూసి ఈ వార్త వేసాను అంటూ ఒక లింక్ పెట్టాడు. అయినప్పటికీ ఇదంతా నీ పనే అయ్యుంటుంది అని పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. నిజా నిజాలేంటో తెలియాల్సి ఉంది. నిర్మాతలు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం వదిలేదే లేదు అంటూ మంచి ఫైర్ మోడ్ లో ఉన్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇకపోతే ‘హరి హర వీరమల్లు’ చిత్రం వచ్చే నెల 12 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.
Also Read: సీరియల్ లోని సన్నివేశాన్ని ‘హిట్ 3’ లో వాడేసారా..? ప్రూఫ్స్ తో సహా దొరికిపోయారుగా!
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో మూవీ టీం ఫుల్ బిజీ గా గడుపుతుంది. రీసెంట్ గానే ముంబై లో పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసాడు. థియేట్రికల్ ట్రైలర్ కూడా రెడీ అయిపోయింది. కేవలం కొన్ని VFX షాట్స్ ని జత చేయాల్సి ఉంటుంది. జూన్ 2న ట్రైలర్ ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ఈ ట్రైలర్ ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ట్రైలర్ కోసం అభిమానులతో పాటు ట్రేడ్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క డైలాగ్ కంటెంట్ కూడా ఈ సినిమా నుండి విడుదల అవ్వలేదు. రెండు మూడు చిన్న గ్లింప్స్ వీడియోలు విడుదల అయ్యాయి కానీ, సినిమా స్కేల్ ని తెలిపేలా ఒక్క కంటెంట్ కూడా రాలేదు. ఈ ట్రైలర్ ఆ లోటుని పూడుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
The speculation regarding AM Ratnam’s health is completely incorrect. At this time, spreading unverified information only causes unnecessary concern. Let’s respect the truth and stop fueling baseless rumors.#HariHaraVeeraMallu
— L.VENUGOPAL (@venupro) May 30, 2025