Hit 3: మన స్టార్ డైరెక్టర్స్ తెరకెక్కించిన కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లోని సన్నివేశాలు, హాలీవుడ్ సినిమాలను ఎక్కువగా చూసే ఆడియన్స్ ‘ఇది పలానా చిత్రం లోని సన్నివేశం’ కదా అని గుర్తు పడుతూ ఉంటారు. రాజమౌళి సైతం తన ప్రతీ సినిమాలో హాలీవుడ్ లోని కొన్ని సన్నివేశాలను కాపీ కొట్టి తీస్తుంటారు. దాదాపుగా పేరు మోసిన స్టార్ డైరెక్టర్స్ అందరూ చేసే పనులు ఇవే. హాలీవుడ్ నుండి కాపీ కొట్టినా ఒక అందం, కానీ రీసెంట్ గా విడుదలైన నాని(Natural Star Nani) ‘హిట్ 3′(Hit: The Third Case) చిత్రం లోని హీరో హీరోయిన్ కి మధ్య వచ్చే ఒక సంభాషణ డైలాగ్స్ తో సహా కాపీ కొట్టారనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?. అసలు ‘హిట్ 3’ మెయిన్ స్టోరీ నే నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషన్ సృష్టించిన ‘స్క్విడ్ గేమ్స్’ అనే పాపులర్ కొరియన్ సిరీస్ నుండి కాపీ కొట్టినది అందరికీ తెలుసు.
Also Read: ప్రధాని మోదీ IAF సందర్శన.. ఆపరేషన్ సిందూర్ వీరులకు అభినందన
అదే విధంగా ఆ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఒక రొమాంటిక్ సన్నివేశం కూడా స్టార్ మా ఛానల్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లోని ఒక ఎపిసోడ్ నుండి కాపీ చేసారు అనేది ఈ క్రింది వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఈ సన్నివేశం లో
హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరో నాని తో మాట్లాడుతూ ‘అమ్మ దగ్గ్గర పెరగలేదు కదా నువ్వు?’ అని అడుగుతుంది. దానికి నాని ‘నీకు ఎలా తెలుసు?’ అని అడగ్గా, ‘ఎలా మాట్లాడాలి ?, ఎలా ప్రేమించాలి? అనేది అమ్మ నేర్పిస్తేనే అర్థం అవుతుంది, లేకపోతే నీలాగే తయారు అవుతారు..నన్ను నేర్పించమంటే ట్రై చేస్తా’ అని అంటుంది. ఇదే సన్నివేశం ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో కూడా ఉంటుంది. కనీసం డైలాగ్స్ కూడా మార్చకుండా డైరెక్టర్ శైలేష్ అలాగే పెట్టేసాడు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ‘దసరా’, ‘సరిపోదా శనివారం’ చిత్రాల తర్వాత నాని నుండి మరో వంద కోట్ల గ్రాస్ సినిమా ఇది. ఇప్పటికీ థియేటర్స్ లో డీసెంట్ స్థాయి రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ చిత్రం, ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఈ చిత్రం హీరో గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా నాని మరో మెట్టు పైకి ఏక్కేలా చేసింది. నిర్మాతగా ఈ ఏడాది ‘కోర్ట్’ చిత్రం తో నాని భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ‘ప్యారడైజ్’ చిత్రంతో ఏ రేంజ్ కి వెళ్ళబోతున్నాడో చూడాలి.