Hari Hara Veera Mallu: క్రియేటివ్ డైరెక్టర్ అంటూ ఎప్పటికప్పుడు డప్పు వేయించుకునే అలవాటు గట్రా ఉన్న క్రిష్ ప్రస్తుతం తెగ కష్టపడుతున్నాడు. అయితే తన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశాడు క్రిష్. కరోనా తగ్గడంతో బడా చిత్రాలన్ని తమ విడుదల తేదీల పై ప్రణాళికలు వేస్తున్నాయి.

కాగా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తదుపరి క్రేజీ చిత్రం హరిహర వీరమల్లు దసరాను టార్గెట్ చేసినట్టు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ నెలలో చిత్ర తదుపరి షెడ్యూల్ ప్రారంభమవుతుండగా సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాలని క్రిష్ భావిస్తున్నారట. ఇప్పటికే 60 శాతం పూర్తి కాగా, అక్టోబర్ 5న విజయ దశమి సందర్భంగా విజయదుందుభి మోగించాలనుకుంటున్నారు.
అయితే, పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ డేట్లు అన్ని సినిమాలకు తలా నాలుగు రోజులు ఇస్తూ ఎలాగోలా ఒకేసారి మూడు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. దాంతో క్రిష్ సినిమా బాగా లేట్ అవుతుంది. అసలుకే మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా. కాబట్టి, సినిమా నేపథ్యానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది.

పైగా పవన్ కి ఈ సినిమాలో 3 షేడ్స్ కు సంబంధించి 3 డిఫరెంట్ గెటప్స్ ప్లాన్ చేశాడు క్రిష్. ఒకటి వజ్రాల దొంగ వీరమల్లు గెటప్ అయితే, సిక్కు సైనికుల్ని కాపాడే రక్షకుడిగా మరో గెటప్, అలాగే దేశం కోసం పోరాడే వీరుడిగా మరో గెటప్ లో పవన్ కనిపించబోతున్నాడు.
అన్నిటికీ మించి 17వ శతాబ్దం నాటి కథ కావడంతో.. పవన్ దుస్తులు, యాక్ససరీస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలా పవన్ పాత్రలో 3 డిఫరెంట్ షేడ్స్, గెటప్స్ ఉండటంతో చాల స్లోగా సాగుతుంది షూటింగ్. ఏది ఏమైనా దసరాకి మాత్రం సినిమా రిలీజ్ చేయాలని నిర్మాత రత్నం ప్లాన్. మరి ఏమవుతుందో చూడాలి.
[…] Also Read: పవన్ ఫ్యాన్స్ కు శుభవార్త.. దసరాకి మళ్… […]
[…] Also Read: పవన్ ఫ్యాన్స్ కు శుభవార్త.. దసరాకి మళ్… […]