Telangana Congress Leaders: తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అధిష్టానం ఎందుకు నమ్మడం లేదు…!

Telangana Congress Leaders: గత పదేళ్లుగా వరుస ఓటమితో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఈసారైనా గెలుపొందాలని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం ప్రజా సమస్యలపై నిత్యం పొరాటాలు చేస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ అధిష్టానం తెలంగాణ విషయంలో అప్రమత్తంగా ఉంది. తాము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన అధికారం రాకపోవడానికి కారనమేంటని విశ్లేషిస్తోంది. ఎక్కడ లోపం జరుగుతంది..? […]

Written By: NARESH, Updated On : April 7, 2022 10:38 am
Follow us on

Telangana Congress Leaders: గత పదేళ్లుగా వరుస ఓటమితో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఈసారైనా గెలుపొందాలని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం ప్రజా సమస్యలపై నిత్యం పొరాటాలు చేస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ అధిష్టానం తెలంగాణ విషయంలో అప్రమత్తంగా ఉంది. తాము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన అధికారం రాకపోవడానికి కారనమేంటని విశ్లేషిస్తోంది. ఎక్కడ లోపం జరుగుతంది..? అనే విషయాలపై చర్చిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ ఇటీవల తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల కోసం అవసరమైన సూచనలు చేశారు. పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఏర్పడింది, ఇందుకోసం ప్రతీ నాయకుడు శ్రమించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే రెండుసార్లు దెబ్బతిన్న కాంగ్రెస్ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడుతోంది.

Telangana Congress Leaders

2014, 2018 ఎన్నికల సమయంలో పార్టీకి నాయకత్వం వహించిన వారు అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించారని కొందరు అంటున్నారు. ఇక్కడ పార్టీ పరిస్థితి బాగా లేకపోయినా కాంగ్రెస్ గెలుస్తుందని అధిష్టానానికి సమాచారం ఇచ్చారని తెలుపుతున్నారు. దీంతో అధిష్టానం తెలంగాణలో పార్టీ గెలుస్తుందని ధీమాతో ఉందన్నారు. ఇలా రెండు పర్యాయాలు ఇక్కడి నాయకులకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీ పరిస్థితి దిగజార్చారని అధిష్టానం భావిస్తోంది. దీంతో ఇటీవల రాజకీయ వ్యూహకర్త సునీల్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసింది. అంటే ఇప్పుడు తెలంగాణలో సునీల్ ఏం చెబితే పార్టీ నాయకులు అలాగే నడుచుకునే పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్రంలో అధికారంలో ఉన్నా టీఆర్ఎస్ ప్రశాంత్ కిశోర్ అనే రాజకీయ వ్యూహకర్తను నియమించుకుంది. దీంతో ఆయనకు పోటీగా ఆయన అనుచరుడు సునీల్ ను రంగంలోకి దించారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకొని వారు పార్టీకి నివేదిక ఇవ్వనున్నారు. ఆయన టీం ప్రతీ నియోజకవర్గంలో సర్వే చేసి ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలనే విషయాన్ని కూడా సూచించనుంది. అంతేకాకుండా ప్రజలు ఎలాంటి పథకాలు కోరుకుంటున్నారు..? వారు అధికారం ప్రభుత్వంపై ఏ విషయంలో వ్యతిరేకతతో ఉన్నారు..? లాంటి విషయాలపై సర్వే చేయనున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర పార్టీ బాధ్యతలు మొత్తం పరోక్షంగా సునీల్ చేతిలోకి వెళ్లిపోతున్నాయన్నమాట.

తెలంగాణ పీసీసీ నాయకత్వం మారితే కాస్త ప్రయోజనం ఉంటుదని భావించి అధిష్టానానికి చేదు అనుభమే ఎదురైనట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా యూత్ ఫాలోయింగ్ ఉన్న రేవంత్ రెడ్డి నియామకం అయిన కొత్తలో దూకుడుగా వ్యవహరించారు. సభలు, సమావేశాలు నిర్వహించి పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని నింపారు. మండలలాల వారీగా కొత్త వారికి అవకాశమిస్తూ పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. నిత్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ మరోవైపు పార్టీ కేడర్లో ఉత్సాహన్ని నింపారు.

Also Read: ఢిల్లీకి చేరిన సీఎం, గవర్నర్ పంచాయితీ?

అయితే పార్టీకి ఉన్న అసంతృప్తి పీడ మాత్ర వదలడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన కొత్తలో రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలందరినీ కలుస్తూ వచ్చారు. దీంతో సానుకూల పరిస్థితులు ఏర్పడడంతో ఇక పార్టీ గాడిలో పడ్డట్లేనని భావించారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత మళ్లీ పాతకథే మొదలైంది. ఇక్కడ అభ్యర్థి ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డిదే లోపం అని కొందరు సీనియర్లు బహిరంగంగానే విరుచుకుపడ్డారు. ఇలా అయితే పార్టీ మరింత దిగజారుడు ఖాయమని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో పరిస్థితి చేయిజారకుండా ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. రెండు పర్యాయాలు పార్టీకి జరిగిన పరాభావం ఈసారి ఎన్నికల్లో మరోసారి జరగకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నారు.అయితే ఈసారి పార్టీ లోకల్ నాయకత్వాన్ని నమ్మకుండా ఢిల్లీ నుంచి కొందరు ఇక్యడ పర్యటించి పర్యవేక్షించనున్నారు. అటు సునీల్ రాజకీయ వ్యూహంతో పార్టీని గాడిలో పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఎన్నికల సమయం వరకు ఎలాంటి పరిస్థితులు ఎదరవుతాయో చూడాలి.

Also Read: మళ్లీ కాళేశ్వరం ఎత్తిపోతలు షురూ..

Tags