Hari Hara Veera Mallu Best Scenes : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్నో ఆటంకాలను ఎదురుకొని షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటి వరకు అభిమానులకు తెలియదు. ఎందుకంటే కంటెంట్ పెద్దగా ఇప్పటి వరకు రివీల్ చేయలేదు కాబట్టి. థియేట్రికల్ ట్రైలర్ తర్వాత ప్రతీ ఒక్కరికి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం హైలైట్ అవ్వబోయే కొన్ని సన్నివేశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. సినిమా ఆరంభం పది నిమిషాలు ఒక మంచి సినిమాని చూస్తున్నాం అనే ఫీలింగ్ ని తీసుకొస్తాడట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సన్నివేశం అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయని తెలుస్తుంది.
Also Read : ట్రైలర్ వచ్చాకే బిజినెస్ పూర్తి చేస్తా అంటూ మొండిపట్టు పట్టిన ‘హరి హర వీరమల్లు’ నిర్మాత!
మచిలీపట్టణం పోర్ట్ ఫైట్ సన్నివేశం, కుస్తీ ఫైట్ సన్నివేశం, కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే సన్నివేశం, ఇంటర్వెల్ సన్నివేశం, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్, ఆ తర్వాత పార్ట్ 2 కోసం తయారు చేయించిన 8 నిమిషాల క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయట. చాలా సన్నివేశాలు ఇచ్చే హై మూమెంట్స్ కి అభిమానులు థియేటర్స్ లో సీట్ల మీద కూర్చోరని, చొక్కాలు చింపుకొని జై పవర్ స్టార్ అని అరుస్తారు అట. ఆ రేంజ్ లో ఈ సన్నివేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో ఎక్కువ శాతం సన్నివేశాలు సనాతన ధర్మం పరిరక్షణ కాన్సెప్ట్ మీద నడుస్తుందని తెలుస్తుంది. ఇదేదో అతికిచ్చినట్టుగా అనిపిస్తే సినిమాకు పెద్ద ప్రమాదం. అలా కాకుండా కథలో అంతర్లీనంగా ఉంటూ అది ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు వస్తాయి.
మొఘల్స్ సామ్రాజ్యం నడుస్తున్న రోజుల్లో నిజంగానే హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఎన్నో పవిత్రమైన దేవాలయాలు నేలమట్టం అయ్యాయి. అంతే కాకుండా హిందువులను హింసలు పెట్టి వాళ్ళ చేత మతమార్పిడి వంటివి కూడా చేసేవారు. ఇలా మొఘల్స్ ఆరోజుల్లో చేసిన అరాచకాలను ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో చూపిస్తారట. ఇది ఆడియన్స్ కి ఎంత కనెక్ట్ అయితే సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన పాటలన్నీ యావరేజ్ రేంజ్ లో ఉన్నాయి. కానీ థియేటర్స్ లో స్క్రీన్ మీద చూసేందుకు ఈ పాటలు చాలా బాగుంటాయని అంటున్నారు. ఓవరాల్ గా బోర్ కొట్టే విధంగా సినిమా ఏక్కడా ఉండదట. కచ్చితంగా సూపర్ హిట్ రేంజ్ లోనే ఉంటుందని, ముఖ్యంగా క్లైమాక్స్ తర్వాత వచ్చే క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశం ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు.