Hari Hara Veera Mallu Record Expectations : చాలా కాలం గ్యాప్ తర్వాత అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రం ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం కోసం అభిమానులు సుమారుగా 5 ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత రీమేక్ కాకుండా పవన్ కళ్యాణ్ నుండి విడుదల అవ్వబోతున్న సినిమా ఇదే. అది కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో నేషనల్ లెవెల్ లో పవర్ ఫుల్స్ లీడర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న సమయంలో వస్తున్న చిత్రమిది. అభిమానులకు ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఈ సినిమా కచ్చితంగా బద్దలు కొట్టాల్సిన రికార్డ్స్ కొన్ని ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ రికార్డ్స్ ఏంటో ఒకసారి క్లుప్తంగా చూద్దాం.
Also Read : హరి హర వీరమల్లు’ లో హైలైట్ అయ్యే సన్నివేశాలు ఇవే..కానీ సెకండ్ హాఫ్ రిస్క్ ఉంది!
సీడెడ్ లో ఈ చిత్రం ‘దేవర’,’పుష్ప 2′ చిత్రాల మొదటి రోజు రికార్డ్స్ ని బద్దలు కొట్టాల్సి ఉంటుంది. ఈ రెండు చిత్రాలకు చెరో 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ‘పుష్ప 2’ చిత్రానికి స్పెషల్ ప్రీమియర్ షోస్ కారణంగా, అదే విధంగా ‘దేవర’ చిత్రానికి 1 గంట షోస్ తో పాటు నాలుగు గంటల షోస్ కారణంగా ఆ రెండు చిత్రాలకు ఆ రేంజ్ షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి 1 గంట షోస్ ఉండవు, కేవలం 4 గంటల షోస్ మాత్రమే ఉంటాయి. ఈ కారణం చేత ‘హరి హర వీరమల్లు’ కి ఆ రెండు సినిమాల రేంజ్ లో మొదటి రోజు వసూళ్లు ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రీమియర్ షోస్ ఏర్పాటు చేసినా, అది కుదరకపోతే మొదటి రోజు అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చినా ఈ చిత్రం సీడెడ్ ప్రాంతం లో ‘దేవర’ ,’పుష్ప 2′ రికార్డ్స్ కొట్టే అవకాశం ఉంటుంది.
ఇక ‘హరి హర వీరమల్లు’ చిత్రం కచ్చితంగా బద్దలు కొట్టాల్సిన రికార్డు ‘దేవర’ నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ గ్రాస్ వసూళ్లు. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు నార్త్ అమెరికా ప్రీమియర్స్ నుండి 2.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీనిని ‘హరి హర వీరమల్లు’ చిత్రం అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రీసెంట్ గానే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 630 షోస్ కి ప్రారంభిస్తే కేవలం లక్షా 50 వేల డాలర్లు మాత్రమే వచ్చింది. పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడితే కానీ అసలు ఈ చిత్రం ‘దేవర’ ని కొడుతుందో లేదో తెలియని పరిస్థితి. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రం కచ్చితంగా 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇవి కొట్టకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరువు పోతుందని సోషల్ మీడియా లో ఇతర హీరోల అభిమానులు కామెంట్ చేస్తున్నారు.