Guntur Karam Movie: గుంటూరు కారం టీంకు గట్టి షాక్.. సాంగ్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్.. దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్…

కొంతమంది ఈ సాంగ్ సినిమాలోని సాంగ్ అంటూ కామెంట్ చేయగా, మరికొందరు మాత్రం సినిమాలో సాంగ్ కాదు ఏదో ప్రైవేట్ సాంగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు.

Written By: Gopi, Updated On : November 4, 2023 11:48 am

Guntur Karam Movie

Follow us on

Guntur Karam Movie: మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ అందరినీ ఆకట్టుకోగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ అనేది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఇక ఈ సినిమా యూనిట్ అఫీషియల్ గా సినిమాకు సంబంధించిన సాంగ్ ని రిలీజ్ చేద్దాం అని అనుకున్నప్పటికీ అనుకోకుండా ఈ సాంగ్ నెట్ లో ప్రత్యేక్షం అయి ఇప్పుడు తెగ హల్చల్ చేస్తుంది.

అయితే ఈ సాంగ్ ను విన్న కొందరు సాంగ్ బాగుంది అని అంటుంటే మరికొందరు మాత్రం సాంగ్ చాలా వరస్ట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి తమన్, మహేష్ బాబు కాంబో లో వచ్చిన దూకుడు, బిజినెస్ మ్యాన్ ,ఆగడు, సర్కార్ వారి పాట సినిమాల్లో కూడా సాంగ్స్ చాలా బాగుంటాయి. అయినప్పటికీ ఈ సినిమాలో ఈ లీక్ అయిన సాంగ్ మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతుందనే చెప్పాలి. కొంతమంది తమన్ గురించి మాట్లాడుతూ మళ్లీ అవే డ్రమ్స్ మ్యూజిక్ చేశాడు అంటుంటే కామెంట్ చేయగా, ఇంకొందరు మాత్రం మళ్లీ తన ట్యూన్స్ తానే కాపీ కొట్టుకుంటున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు, మరికొందరు మాత్రం తమన్ ఎప్పట్లాగే మళ్లీ రాడ్డు దింపాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి తమన్ ఇచ్చే ప్రతి సినిమా ట్యూన్ కూడా కాపీ అంటూ చాలా రకాల చర్చలు జరుగుతాయి. ప్రతి సినిమా విషయం లో ఈ విషయం మీదనే సోషల్ మీడియాలో తమన్ ని విపరీతమైన ట్రోలింగ్ చేస్తూ ఉంటారు…అయినప్పటికీ సినిమా మేకర్స్ తమన్ ని ఎలా తీసుకుంటున్నారనే దాని మీదనే ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ లీక్ అయిన సాంగ్ సినిమాలోనిదేనా, కాదా అనే విషయం పైన క్లారిటీ అయితే రావట్లేదు.

కొంతమంది ఈ సాంగ్ సినిమాలోని సాంగ్ అంటూ కామెంట్ చేయగా, మరికొందరు మాత్రం సినిమాలో సాంగ్ కాదు ఏదో ప్రైవేట్ సాంగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు.ఎందుకంటే ఈ సాంగ్ సినిమాలోని సాంగ్ అయితే మాత్రం ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మొత్తం కోల్పోక తప్పదు అంటూ కామెంట్ చేస్తున్నారు.మహేష్ బాబు సినిమా అంటే సాంగ్స్ ఆ సినిమాకి బలంగా మారుతాయి ఆయన తీసిన రాజకుమారుడు సినిమా నుంచి మొన్న వచ్చిన సర్కార్ వారి పాట సినిమా వరకు అన్ని సినిమాల్లో సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి….

ఇక ఇలాంటి రాడ్ సాంగ్స్ చూడాలంటే మాత్రం ప్రేక్షకులకి ఇబ్బంది అవుతుందంటూ ఫ్యాన్స్ తీవ్రమైన ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ సాంగ్ ఈ సినిమాలోనిదేనా, కాదా అనేది తెలియాలంటే మరి కొద్దీ రోజులు వెయిట్ చేయక తప్పదు…