https://oktelugu.com/

Rathika Rose: రాహుల్-రతిక ల ప్రైవేట్ ఫొటోలు లీక్ చేసింది అతనే.. నమ్మలేని నిజాలు బయటపెట్టిన రతిక సోదరి

పటాస్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ప్రియ కొద్దిగా పేరు వచ్చాక రతికా రోజ్ గా మారిపోయింది. ఆ తర్వాత కొన్ని షోలలో పాల్గొంది. అంతే కాదు సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. బిగ్ బాస్ కు వెళ్లకముందే కొన్ని ఆల్బమ్స్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి నటించింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 4, 2023 / 11:43 AM IST

    Rathika Rose

    Follow us on

    Rathika Rose: బిగ్ బాస్ హౌజ్ లో ఈ సారి జరిగినంత రచ్చ మరోసారి జరగలేదు అనేది కాదనలేని వాస్తవం. అన్ని షోలు వేరు అయితే ఉల్టా పల్టా అంటూ ఈ సారి కొత్తగా గేమ్ ను మొదలుపెట్టారు బిగ్ బాస్. కానీ అదే గొడవ, ప్రేమలు, ఎలిమినేషన్. కొన్ని మాత్రమే మార్పులు ఉన్నా కూడా అనుకున్న రేంజ్ లో ఎలాంటి మార్పులు లేవని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సారి ఎలిమినేట్ అయిన వారు కూడా తిరిగి హౌస్ లోకి వచ్చారు. అదేనండి రతికా..ఈమె గురించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటి అంటారా? అయితే ఇది మీకోసమే..

    పటాస్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ప్రియ కొద్దిగా పేరు వచ్చాక రతికా రోజ్ గా మారిపోయింది. ఆ తర్వాత కొన్ని షోలలో పాల్గొంది. అంతే కాదు సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. బిగ్ బాస్ కు వెళ్లకముందే కొన్ని ఆల్బమ్స్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి నటించింది. అప్పుడే అతనితో ప్రేమలో పడిందట ఈ చిన్నది. కానీ కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య బ్రేకప్ అయింది అనే టాక్ కూడా ఉంది. అయితే పర్సనల్ చెప్పుకోవడం బిగ్ బాస్ లో కామన్. అది కూడా కెమెరాలు ఉండగానే బయటపెడుతుంటారు. బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన రతిక కూడా తన ప్రేమ విషయం దామినికి చెప్పింది. ఆమె నామినేషన్ లో చెప్పడంతో బయట రచ్చ అయింది. అప్పుడే రతిక రాహుల్ ప్రైవేట్ ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. అయితే దీనిపై రాహుల్ స్పందిస్తూ.. తనకు ఏ సంబంధం లేదని.. ఓట్ల కోసం చిల్లర పనులు చేస్తున్నారని రతికపై ఇండైరెక్ట్ గా ఫైర్ అయ్యాడు.

    రీసెంట్ గానే రతిక సోదరి ఈ విషయంపై స్పందించింది. అయితే ఆమె సోదరి రతిక, రాహుల్ ల ప్రేమ వ్యవహారం బయటపెట్టింది. రతిక రాహుల్ ప్రేమించుకున్న మాట నిజమే. ఇంట్లో ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు. కూతురు ఆనందం కోసం మా నాన్న కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ అదే సమయంలో రాహుల్ రతికకు కండీషన్స్ పెట్టాడు. తనను పెళ్లి చేసుకున్నాక సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లకూడదు.. అక్కడ పని చేయకూడదు అని చెప్పాడట. ఈ కండీషన్స్ రతికకు నచ్చలేదట. ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చాక బ్రేకప్ చెప్పుకున్నారని తెలిపింది రతిక సోదరి..

    రతిక-రాహుల్ ప్రైవేట్ ఫొటోలు లీక్ అయిన విషయం తెలిసిందే. వీటిపై స్పందిస్తూ.. ఆ ఫోటోలను లీక్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. కానీ ఈ ఫోటోలను లీక్ చేసింది కచ్చితంగా రాహులే అంటూ తెలిపింది. రతిక బిగ్ బాస్ లో ఉంది. ఆమె వద్ద ఫోన్ కూడా లేదు. వారి ప్రైవేట్ ఫోటోలు వారి దగ్గర కాకుండా వేరే వారి వద్ద ఉండే అవకాశం లేదు. కచ్చితంగా రతికను నెగిటివ్ చేయడానికి ఇలా రాహుల్ ఆ ఫొటోలు లీక్ చేసి ఉంటాడు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాయి. మరి చూడాలి వీటిపై రాహుల్ ఎలా స్పందిస్తారో..