పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. మనిషిలో దాతృత్వం కూడా అలాగే వస్తుంది. సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించే సోనూసూద్ నిజజీవితంలో మాత్రం కథానాయకుడే. తనలోని దయా గుణంతో ఎదుటి వారికి సేవలందించడంలో ముందుంటున్నారు. ఎవరు చేయలేని పనులు చేస్తూ అందరిలో ప్రశంసలు అందుకుంటున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఆపన్నం కోసం ఎదురుచూసిన వారికి తనకు తోచిన విధంగా సాయపడుతూ వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నాడు.
కరోనా సంక్షోభంలో వలస కూలీల బతుకులను చూసి సోనూసూద్ చలించిపోయాడు. దీంతో వారికి భరోసా అందించేందుకు కదిలాడు. కష్టాల్లో ఉన్న వారిని రక్షించేందుకు నడుం బిగించాడు. రీల్ హీరో నుంచి రియల్ హీరోగా మారాడు. ఎవరు కష్టాల్లో ఉన్నా తన కళ్లలో నీళ్లు తిరగడంతో వారిని కష్టాల నుంచి గట్టెక్కించాడు. కలియుగ కర్ణుడిగా పేరు తెచ్చుకున్నాడు. తనలోని మానవత్వాన్ని చాటాడు.
సోనూసూద్ పై ప్రజల్లో అభిమానం పెరిగిపోతోంది. రోజురోజుకు ఆయనలోని సేవా గుణంతో ఎదుటివారిని కూడా తన అనుచరుడిగా చేసుకుంటున్నారు. ఎవరు ఆపదలో ఉన్నా సరే వారికి సాయం అందించేందుకు శక్తియుక్తులు లేకుండా పాటుపడుతున్నారు. ఎంతలా ఆయనపై అభిమానం కలుగుతోందంటే పిల్లల పేర్లు కూడా ఆయనవే పెట్టుకోవడం గమనార్హం. ఇంకొంత మది ఆయనకు గుడి కట్టించి దేవుడిలా కొలవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వారి పట్ల కూడా సోనూసూద్ తన ప్రేమ చూపించాడు. వారి గిరాకీ పెరిగేందుకు వారి తరఫున కూడా ప్రచారం చేస్తూ కనిపిస్తున్నాడు. దీంతో వారు కూడా తన అభిమానులైపోతున్నారు. పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు పలువురు సినిమా తారలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
సోనూసూద్ పరాయి భాష నటుడైనా ఎక్కడ కూడా ప్రాంతీయ అభిమానం చూపలేదు. ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా తనను కలిసిన వారికి తోచిన సహాయం చేస్తున్నారు. వారి సమస్యను బట్టి వారికెంత మేర అవసరమవుతుందో గుర్తించి వారి బాధలను తీరుస్తున్నాడు.దీంతో అందరికి ఆరాధ్య దైవంగా మారాడు. అన్ని భాషల వారిని తన వైపు చూసేలా వారికి సహాయం చేస్తూ దేవుడవుతున్నాడు.