Hanuman: ఏకంగా మహేష్ బాబును హనుమాన్ తో ఢీ కొట్టాడు తేజ సజ్జా. గుంటూరు కారం, హనుమాన్ ఒకే రోజు విడుదలయ్యాయి. గుంటూరు కారం కి మిక్స్డ్ టాక్ దక్కింది. హనుమాన్ చిత్రంపై పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. హనుమాన్ మూవీ కథ, కథనం ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభను కొనియాడుతున్నారు. హనుమాన్ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతం అంటున్నారు ప్రేక్షకులు. తక్కువ బడ్జెట్ లో ఈ క్వాలిటీ విజువల్స్ ఊహించలేదని కామెంట్స్ చేస్తున్నారు.
2024 సంక్రాంతి హిట్ చిత్రాల్లో హనుమాన్ ఒకటని తెలుస్తుంది.కాగా హనుమాన్ విజయం సాధిస్తే సీక్వెల్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందే చెప్పారు. క్లైమాక్స్ లో పార్ట్ 2 కోసం లీడ్ కూడా ఇచ్చారు. బాహుబలి చిత్రంలో సీక్వెల్ కోసం రాజమౌళి ఇచ్చిన లీడ్ భారీ ప్రచారం కల్పించింది. అదేమిటంటే ‘కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు?’. అప్పట్లో ఈ డైలాగ్ ఇండియా వైడ్ పాప్యులర్ అయ్యింది. అలాగే ప్రశాంత్ వర్మ సైతం ఇదే తరహా లీడ్ వదిలాడు.
రాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? అంటూ సెకండ్ పార్ట్ పై క్యూరియాసిటీ పెంచేశాడు. ఈ క్రమంలో హనుమాన్ పార్ట్ 2 పై అంచనాలు పెరిగిపోయాయి. హనుమాన్ సీక్వెల్ కి టైటిల్ గా జై హనుమాన్ నిర్ణయించారు. ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. 2025లో జై హనుమాన్ విడుదల చేస్తారని సమాచారం.
హనుమాన్ మూవీ విషయానికి వస్తే ఇది ఒక సూపర్ హీరో కథ. చిన్న దొంగ అయిన తేజ సజ్జాకు ఒక మణిహారం దొరుకుతుంది. దాంతో అద్భుత శక్తులు సంక్రమిస్తాయి. హీరో దగ్గర ఉన్న మణిహారం సొంతం చేసుకుని తాను సూపర్ హీరోగా ఎదగాలని విలన్ వినయ్ రాయ్ భావిస్తాడు. వీరిద్దరి మధ్య సంఘర్షణే హనుమాన్. ఈ సోషియో ఫాంటసీ కథకు డివోషనల్ టచ్ ఇచ్చారు. వరలక్ష్మి శరత్ కుమార్, అమృత అయ్యర్ కీలక రోల్స్ చేశారు.