Jr. NTR : దేవర కోసమే ఎన్టీయార్ ఆ స్టార్ డైరెక్టర్ తో చేయాల్సిన సినిమాను వదులుకున్నాడా..?

ప్రస్తుతం స్టార్ హీరోలందరికి ఒక సెపరేట్ స్టైల్ ఉంది. అందుకే ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన సినిమాలను చేస్తూ ముందుకు కదులుతున్నారు...ఇక మన స్టార్ హీరోల అందరి ఎజెండా ఒక్కటే ఒక మంచి సినిమా తీయడం...

Written By: Gopi, Updated On : August 4, 2024 8:13 am
Follow us on

Jr. NTR :  ఈ తరం హీరోల్లో ఏ పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎన్టీయార్ అనే చెప్పాలి. ఎంత పెద్ద డైలాగ్ అయిన సింగిల్ టేక్ లో చెప్పగలడు. ఇక హేవీ డ్యాన్స్ మూమెంట్లు వేయాలన్న , ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించాలన్న అది ఎన్టీఆర్ వల్లే సాధ్యమవుతుంది. ఇక ఒకప్పుడు మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం తనకంటూ ఒక బ్రాండ్ వాల్యూ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే యూనివర్సల్ సబ్జెక్టులను ఎంచుకొని సినిమాలుగా చేయడమే కాకుండా పాన్ ఇండియా లో కూడా మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దీని తో పాటు గా ఇతర దేశాల్లో కూడా తన సినిమాలకు మంచి గిరాకీ ఉండే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నాడు. ఇప్పుడు ‘కొరటాల శివ ‘ డైరెక్షన్ లో చేస్తున్న దేవర సినిమా కంప్లీట్ అయిపోయింది. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే దేవర సినిమా రెండు పార్ట్ లుగా వచ్చిన విషయం మనకు తెలిసిందే…ఇక ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ఒక స్టార్ డైరెక్టర్ తో చేయాల్సిన సినిమాని వదిలేసుకున్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి విక్రమ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న లోకేష్ కనకరాజ్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనే ప్రణాళికలను రూపొందించుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్టుకి ఎన్టీఆర్ నో చెప్పాడు. ఇక దానికి కారణం లోకేష్ తో సినిమా చేయడం ఇష్టం లేకనో, లేదంటే ఆయన చెప్పిన కథ నచ్చకపోవడం వల్లానో కాదు. ఎన్టీఆర్ దేవర సినిమాలో బిజీగా ఉండడమే దానికి ముఖ్య కారణం అని తెలుస్తుంది.

ఇక ముఖ్యంగా దేవర సినిమా రెండు పార్టు లుగా రావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ఆయన భారీగా డేట్లను కేటాయించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇలాంటి సమయంలో లోకేష్ కనకరాజ్ ను సినిమా కోసం వెయిట్ చేయించడం సరైన విషయం కాదనే ఉద్దేశ్యం తోనే ఆయన ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఇక దాంతో లోకేష్ ఆ కథను పక్కనపెట్టి ఇంకో కథ రాసుకొని విజయ్ తో లియో అనే సినిమా చేశాడు.

ఇక మొత్తానికైతే దేవర సినిమా వల్ల ఒక స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేయాల్సిన ఎన్టీఆర్ ఆ సినిమాను వదిలేసుకోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ కు ఇప్పుడు పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే ఉంది. ఇక లోకేష్ తో సినిమా చేస్తే ఆయనకు మార్కెట్ అనేది బాగా వర్కౌట్ అయ్యేది. ఇప్పుడు ఎన్టీఆర్ కి పాన్ ఇండియాలో అంత పెద్దగా మార్కెట్ అయితే లేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ క్రేజ్ ఏర్పడడమే కాకుండా త్రిబుల్ ఆర్ సినిమాతో 1200 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినప్పటికి ఆ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు.

ఇక దానికి తోడుగా రాజమౌళికి హీరోల కంటే ఎక్కువ బ్రాండ్ వాల్యూ ఉంది. కాబట్టి ఎన్టీఆర్ వల్ల ఆ సినిమాకు అంత మొత్తం లో కలెక్షన్లు అయితే రాలేదు. అందుకే ఇప్పుడు దేవర సినిమాతో తనను తన ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఎన్టీయార్ లోకేష్ కనకరాజ్ తో సినిమా మిస్ చేసుకోవడం అనేది ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయమనే చెప్పాలి…