బబ్లీ బ్యూటీ హన్సిక నటించిన కొత్త సినిమా ‘మహా’ ప్రస్తుతం వివాదాలమయం అయిపోయింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వ్యక్తి యు.ఆర్. జమీల్. అయితే, దర్శకుడు యు.ఆర్. జమీల్ చెప్పకుండానే ‘మహా’ సినిమాని ఓటీటీలో విడుదలకు సిద్ధం చేస్తున్నారని, ఎలాగైనా విడుదల పై నిషేధం విధించాలనేది దర్శకుడు జమీల్ డిమాండ్ గా ఉంది.
అయినా దర్శకత్వం వహించిన అంత మాత్రాన ఓటీటీలో విడుదల చేయకూడదు అని చెప్పడానికి అతనెవరు అనేది నిర్మాత అభిప్రాయం. నిజమే డబ్బులు ఖర్చు పెట్టినవాడికే సినిమా పై ఎక్కువ అధికారం ఉంటుంది, దర్శకుడికి కేవలం క్రియేటివిటీ పరంగానే హక్కు ఉంటుంది. అలాంటప్పుడు ఒక దర్శకుడికి సినిమా రిలీజ్ నచ్చలేదు అని విడుదల పై ఎలా నిషేధం విధిస్తారు ?
అసలు జమీల్ ఎందుకు ఇలా డిమాండ్ చేస్తున్నాడు ? అంటూ అతని పై చాల విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శల పై జమీల్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా పెండింగ్ పనులను నాకు తెలియకుండానే పూర్తి చేయడం జరిగింది. నా క్రియేటివిటీలో నాకు తెలియకుండానే ఎలా మార్పులు చేస్తారు ? నిర్మాత మదియళగన్ నాకు 24 లక్షలు పారితోషికం చెల్లిస్తా అని మాట ఇచ్చారు.
అయితే, ఇప్పటి వరకు ఆయన నాకు కేవలం 8.15 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇంకా రూ.10 లక్షల పరిహారంతో పాటు, నాకు రావాల్సిన రెమ్యూనరేషన్ బకాయిను కూడా ఆయన చెల్లించాలి’ అంటూ జమీల్ అడుగుతున్నాడు. మరి నిర్మాత ఎంతవరకు ఈ డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుంటాడో.. ఒక్కటి మాత్రం స్పష్టం అవుతుంది. దర్శకుడి డిమాండ్ కి నిర్మాత హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడు.