https://oktelugu.com/

Hansika: సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైన హన్సిక హారర్ థ్రిల్లర్… ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది? ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

హన్సిక ఓ భిన్నమైన రోల్ లో అద్భుతంగా నటించింది. కాగా హన్సిక తెలుగులో పెద్దగా నటించడం లేదు. ఆమె కేవలం కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 4, 2024 / 04:36 PM IST

    Hansika-Motwani-Horror-Come

    Follow us on

    Hansika: హీరోయిన్ హన్సిక లేటెస్ట్ మూవీ గార్డియన్. హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ తమిళ చిత్రం సమ్మర్ కానుకగా మార్చి 8న విడుదల చేశారు. గార్డియన్ చిత్రానికి శబరి అండ్ గురు శరవణన్ దర్శకులు. సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక రోల్స్ చేశారు. ఈ సినిమాకు థియేటర్స్ లో అంతగా ఆదరణ దక్కలేదు. రొటీన్ స్టోరీ అంటూ విమర్శకులు పెదవి విరిచారు. గార్డియన్ మూవీ చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చింది.

    గార్డియన్ చిత్ర డిజిటల్ రైట్స్ సింప్లీ సౌత్ అనే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కొనుగోలు చేసింది. గార్డియన్ మూవీ ప్రస్తుతం సింప్లీ సౌత్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఓవర్సీస్ ఆడియన్స్ కి మాత్రమే ప్రస్తుతం గార్డియన్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. త్వరలో ఇండియన్ ఆడియన్స్ కూడా గార్డియన్ చిత్రాన్ని ఓటీటీలో చూడొచ్చు. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ లో గార్డియన్ మూవీ స్ట్రీమ్ కానుంది.

    గార్డియన్ చిత్ర కథ విషయానికి వస్తే… అపర్ణ(హన్సిక) ఓ ఇంటీరియర్ డిజైనర్. ఆమె అనుకోని ప్రమాదానికి గురవుతుంది. ఈ పరిణామంతో ఆమె జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అపర్ణను ఒక ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ శరీరం సహాయంతో నగరంలో గల కొందరు బడా బాబులను చంపేస్తూ ఉంటుంది. ఆ ఆత్మ ఎవరు? అపర్ణను ఎందుకు ఆవహించింది? ఆ ఆత్మ కొందరి మీద ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటుంది? అనేది మిగతా కథ…

    హన్సిక ఓ భిన్నమైన రోల్ లో అద్భుతంగా నటించింది. కాగా హన్సిక తెలుగులో పెద్దగా నటించడం లేదు. ఆమె కేవలం కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. హన్సిక 2022లో సోహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఆయనకు ఇది రెండో వివాహం. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన హన్సికను దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ చేశాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దేశముదురు చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించారు. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ తో ఆమె జతకట్టింది.