Credit Score: బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి క్రెడిట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఇది బాగుంటేనే గుడ్ కస్టమర్ గా పరిగణిస్తారు. దీని ద్వారానే లోన్ ఎంక్వైరీ చేస్తారు. కొందరు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని సరైన సమయంలో ఈఎంఐ చెల్లించలేరు. దీంతో వీరి క్రెడిట్ స్కోరు పడిపోయి బ్యాడ్ కస్టమర్ కిందకు వస్తారు. ఇలా పదే పదే పడిపోతే కొన్ని బ్యాంకు వ్యవహారాలు కష్టంగా ఉంటాయి. అయితే మన క్రెడిట్ స్కోర్ గురించి ఎప్పటికప్పుడు తెలియాలంటే ఏం చేయాలి? ఇలా పదే పదే చెక్ చేసుకుంటే ఛార్జీలు పడుతాయా? లేక ఎక్కువ సార్లు క్రెడిట్ స్కోర్ చేసుకుంటే స్కోరు తగ్గుతుందా?
ఒక బ్యాంకు కస్టమర్ ట్రాన్జాక్షన్ ఎలా ఉందనేది క్రెడిట్ స్కోర్ ఆధారంగా తెలుసుకుంటారు. బ్యాంకు రుణాలు ఇచ్చేటప్పుడు దీనిని చూస్తారు. అలాగే ఆఫర్లు, క్రెడిట్ కార్డులు ఇతర సదుపాయాలను కల్పించాలంటే క్రెడిట్ స్కోర్ తప్పనిసరి. అందువల్ల చాలా మంది క్రెడిట్ స్కోర్ పడిపోకుండా జాగ్రత్త పడుతారు. క్రెడిట్ స్కోరు ఎలా ఉంది అనేది పదే పదే చూసుకోవడానికి అవకాశం ఉంటుది. దీనిని మొబైల్ లోనే చెక్ చేసుకోవచ్చు. క్రెడిట్ స్కోరుకు సంబంధించిన యాప్ ల ద్వారా ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు.
క్రెడిట్ స్కోర్ ను రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు. ఒకటి చేతిలో మొబైల్ ఉంటే యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికి పెద్దగా ఛార్జీలు ఉండవు. ఈ యాప్ లేదా కొన్ని వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు వీటి ద్వారా క్రెడిట్ స్కోరు పరిస్థితిని తెలుసుకోవచ్చు. దీనిని సాప్ట్ ఎంక్వైరీ అంటారు. ఇలా కాకుండా బ్యాంకు ద్వారా కూడా క్రెడిట్ స్కోర్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. అయితే ఇది బ్యాంకు రుణాలు ఇచ్చే టప్పుడు చెక్ చేస్తారు. దీనిని హార్డ్ ఎంక్వైరీ అంటారు.
అయితే హార్డ్ ఎంక్వైరీని పలుసార్లు చేయడం వల్ల క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. అందువల్ల అవసరం ఉంటే తప్ప పదే పదే బ్యాంకుకు వెళ్లి హార్డ్ ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే క్రెడిట్ స్కోర్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎలా అంటే.. దీనికి paisabazar.com అనే వెబ్ సైట్ లోకి వెళ్లి మొబైల్ నెంబర్ ఇస్తే చాలు. క్రెడిట్ స్కోరు తెలిసిపోతుంది. ఇది వెబ్ సైట్ మాత్రమే కాకుండా యాప్ కూడా ఉంది. అందువల్ల దీనిద్వారా ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు క్రెడిట్ స్కోర్ ఎంక్వైరీ చేసి క్రెడిట్ స్కోర్ తగ్గకుండా జాగ్రత్తపడండి..