Guruvayoor Ambalanadayil Movie Review : గురువాయురంబాల నడాయల్’ ఫుల్ మూవీ రివ్యూ…

Guruvayoor Ambalanadayil ఇక కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా ఆ సీన్లని చాలా అద్భుతంగా వచ్చేలా చేసింది. ఇక అలాగే మేకింగ్ పరంగా అయితే విపిన్ దాస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు

Written By: Gopi, Updated On : July 2, 2024 9:22 am

Guruvayoor Ambalanadayil Movie Review

Follow us on

Guruvayoor Ambalanadayil Movie Review : మలయాళం సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేయగల హీరోలలో పృధ్విరాజ్ సుకుమారన్ ఒకరు. ఈయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అందులో కచ్చితంగా ఏదో ఒక కొత్త పాయింట్ అయితే ఉంటుందనే అంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక సీనియర్ హీరో అయిన మమ్ముట్టి ఎలాంటి పాత్రలను అయితే ఎంచుకొని ముందుకు దూసుకెళ్తున్నాడో యంగ్ హీరోల్లో పృధ్వీరాజ్ సుకుమారన్ కూడా అలాంటి ఒక టైప్ ఆఫ్ స్టోరీస్ ని ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

ఇక రీసెంట్ గా ‘ఆడు జీవితం’ అనే ఒక డిఫరెంట్ మూవీ తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న తను ప్రస్తుతం’గురువాయురంబాల నడాయల్’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా మే లోనే రిలీజ్ అయినప్పటికీ ప్రస్తుతం ఈ సినిమా ఆమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఒకసారి మనం బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే గురువాయూర్ కి చెందిన విను రామచంద్రన్ (బాసిల్ జోసెఫ్) ఉద్యోగం చేస్తూ దుబాయ్ లో సెటిల్ అవుతాడు. అతడికి అంజలి(అనస్వర రాజన్) అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ అవుతుంది. ఇక జంషద్ పూర్ లో అంజలి వాళ్ల అన్నయ్య ఆనంద్ (పృధ్వీరాజ్ సుకుమారన్) జాబ్ చేస్తుంటాడు. ఇక ఇదే సమయం లో ఆనంద్ కి విను తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అయితే విను గతంలో పార్వతి (నిఖిలా విమల్)ను ప్రేమించి విఫలమవుతాడు.

ఇక తను అతన్ని మోసం చేసింది అనే ఉద్దేశ్యంతో లైఫ్ లో మరో స్టెప్ ముందుకు వెళ్లలేక ఆమె గురించి తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు. ఇక ఇలాంటి సమయంలోనే ఆనంద్ విను ను మోటివేట్ చేసి అతను తన ఫ్యూచర్ మీద ఫోకస్ చేసేలా చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆనంద్ కూడా తన భార్య అయిన పార్వతి కి ఒక ప్రేమలేఖ వచ్చిందనే ఉద్దేశ్యంతో తనను పుట్టింటికి పంపిస్తాడు. ఇక విను కూడా తన వైఫ్ ని ఇంటికి తెచ్చుకోమని ఆనంద్ కు చెబుతాడు. దాంతో ఆనంద్ కూడా తన భార్య అయిన పార్వతిని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇక ఇప్పుడు పార్వతికి వినుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి.? ఆనంద్ పార్వతిని తన పుట్టింటికి వెళ్ళగొట్టడానికి కారణం ఎవరు అనే విషయాలు తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాను మీరు చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సినిమా డైరెక్టర్ అయిన ‘విపిన్ దాస్’ ఎలా అయితే తెర ఎక్కించాలనుకున్నాడో అలాగే తీశాడు. ఎక్కడా కూడా డివిషన్స్ కి వెళ్లకుండా అనుకున్న కథను పెర్ఫెక్టుగా పోట్రే చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఇది రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం అయితే కాదు. పెళ్లి తర్వాత వచ్చే ఇబ్బందులను చాలా ఇంటి నాచురల్ గా చూపిస్తూ సినిమాలో ఎక్కడ కూడా అసభ్య సీన్లు పెట్టకుండా చాలా డీసెంట్ గా తెరకెక్కించారు.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పృథ్వి రాజ్ సుకుమారన్ మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలను ఆయన హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. ఇక ఎప్పుడైనా కానీ భార్య భర్తల మధ్య ఉండే స్టోరీని డీల్ చేయాలంటే అది చాలా కష్టం. కొంచెం తప్పటుడుగు వేసినా కూడా ఆ సినిమా మీద ఇంపాక్ట్ పడే అవకాశాలైతే పుష్కలంగా ఉంటాయి. ఆయన మాత్రం ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా సరైన దారిలోనే సినిమాను తీసుకెళ్లాడు…

ఇక కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా ఆ సీన్లని చాలా అద్భుతంగా వచ్చేలా చేసింది. ఇక అలాగే మేకింగ్ పరంగా అయితే విపిన్ దాస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ప్రతి సీన్ ని తను ఎలాగైతే కలగన్నాడో అలాగే చిత్రీకరించడానికి ప్రయత్నం చేశాడు. ఇక సెకండాఫ్ స్టార్టింగ్ లో ఇక రొటీన్ రొట్ట కథలు కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి ఆయన తీసిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది…

ఆర్టిస్ట్ లా పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఎప్పటి లాగే పృధ్వీరాజ్ సుకుమారన్ చాలా అద్భుతంగా నటించి సినిమా విజయంలో కీలకపాత్ర వహించాడనే చెప్పాలి. ఇక చాలెంజింగ్ రోల్ ను ఎంచుకొని అందులో నటించడం అంటే తనకు చాలా ఇష్టం. అందుకోసమే ఆయన ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాని చాలా ఉత్తమమైన స్థాయిలో తన నటన ఉండాలని కోరుకుంటాడు. అందుకే ఆయన సినిమాల్లో నటన చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుంది… ఇక బాసిల్ జోసఫ్, నిఖిలా విమల్, అనస్వర రాజన్ వీరి ముగ్గురు కూడా చాలా వరకు ఈ సినిమాకు న్యాయం చేయడమే కాకుండా సినిమాను నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ అయ్యే విధంగా చాలా బాగా నటించి మెప్పించారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన అంకిత్ మీనన్ చాలా చక్కని మ్యూజిక్ ని అందించాడు. ఇక పాటల విషయంలో ఓకే అనిపించినప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ ను మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడనే చెప్పాలి. సినిమాలో వచ్చే ఫీల్ ని ఏమాత్రం చెడగొట్టకుండా ఆయన మ్యూజిక్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు… ఇక సినిమాటోగ్రాఫర్ నీరజ్ రేవి కూడా చాలా చక్కటి విజువల్స్ ను అయితే అందించాడు. ఇక మొత్తానికైతే ఆయన ఇచ్చిన విజువల్స్ తో సినిమా అవుట్ ఫుట్ అనేది చాలా అద్భుతంగా రావడమే కాకుండా సినిమా విజయంలో ఆయన చాలా కీలక పాత్ర వహించాడు…ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా రేంజ్ కి తగ్గట్టుగానే ఉన్నాయి…

ప్లస్ పాయింట్స్

కథ
పృథ్వి రాజ్ సుకుమారన్
డైరెక్షన్

మైనస్ పాయింట్స్

సెకండాఫ్ స్టార్టింగ్ లో కొంచెం స్లో అయింది.

రేటింగ్
ఇక ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్
ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన సినిమా…