Gurram Paapi Reddy Twitter Talk: ఈ ఏడాది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాలకంటే ఎక్కువగా చిన్న సినిమాలకు బాగా కలిసొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు, బయ్యర్స్ కి కాసుల కనకవర్షం కురిపించాయి. దీంతో పెద్ద నిర్మాతలు సైతం పెద్ద హీరోలతో సినిమాలు తీసే బదులు, కొత్తవాళ్లతో, మంచి కథతో చిన్న సినిమాలను తియ్యడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని చిన్న సినిమాలు అయితే ట్రైలర్స్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్స్ ద్వారా జనాల దృష్టిని ఆకర్షించి, మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటున్నాయి. అలా విడుదలకు ముందు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి'(Gurram Papireddy). నరేష్ అగస్త్య, ఫైరా అబ్దుల్లా హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు, మన టాలీవుడ్ లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం వంటి వారు కూడా నటించారు.
Gurram Papireddy is a different, dark comedy that delivers complete entertainment, says #FariaAbdullah ❤️
Releasing TODAY – Dec 19th
Get ready for something new on the big screen#GurramPapireddy @fariaabdullah2 pic.twitter.com/KalVwt6QPq— Naresh Allu (@naresh_allu) December 19, 2025
నేడు ‘అవతార్ 3’ చిత్రం తో పాటు ఈ సినిమా కూడా విడుదలైంది. ఈ చిత్రానికి ట్విట్టర్ ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక డిఫరెంట్ డార్క్ కామెడీ థ్రిల్లర్ ని ఎంగేజింగ్ గా తియ్యడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని, కాసేపు టైం పాస్ చేద్దామని థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ కి కచ్చితంగా ఈ సినిమా థ్రిల్లింగ్ అనుభూతి ఇస్తుందని అంటున్నారు. కథ విషయానికి వస్తే శ్రీశైలం లో 5 శవాలను దొంగిలించడానికి హీరో గ్యాంగ్ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకు అలా చేయాలనీ అనుకున్నారు, అలా దొంగలిస్తున్న సమయం లో పోలీసులకు చిక్కిన తర్వాత ఏమి జరిగింది? అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
The new dark comedy thriller #GurramPapiReddy world wide grand release today pic.twitter.com/gJ1yztqeej
— Prabhas ™ (@Prabhas_Anwar2) December 19, 2025
హీరో నరేష్ అగస్త్య మరియు హీరోయిన్ ఫైరా అబ్దుల్లా కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో మనం గత సినిమాల్లో చూసాము. ఈ చిత్రం లో కూడా వీళ్లిద్దరు కామెడీ టైమింగ్ లో అదరగొట్టారు. ఇక బ్రహ్మానందం, యోగిబాబు వంటి వారిని తీసుకున్నారు కానీ, డైరెక్టర్ ఎందుకో వాళ్ళను సరిగా ఉపయోగించుకోలేదు అని అని అనిపించింది. ఓవరాల్ గా ఈ చిత్రం వీకెండ్ లో ఆడియన్స్ ని అలరించే విధంగానే తెరకెక్కించారు. కమర్షియల్ గా సక్సెస్ అవుతుందా లేదా అనేది మూవీ టీం ప్రొమోషన్స్ మీద ఆధారపడుంది. ఇకపోతే ట్విట్టర్ లో ఈ చిత్రాన్ని చూసిన ఆడియన్స్ నుండి ఎలాంటి రియాక్షన్ వచ్చిందో కొన్ని ట్వీట్స్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
గుర్రం పాపిరెడ్డి పేరు గమ్మత్తుగా ఉంది | ABN Chitrajyothy#Gurrampapireddy #Brahmanandam @abnchitrajyothy pic.twitter.com/wPMbb8VbaV
— ABN Chitrajyothy (@abnchitrajyothy) December 17, 2025
వేదికపై జీవన్ కు బొట్టుతో పాటూ దిష్టి చుక్క కూడా పెట్టిన హీరోయిన్ ఫరియా..#GurramPaapiReddyOnDec19th#GurramPapiReddy pic.twitter.com/uQpT2Do4cL
— Mega Abhimani (@megaabhimani3) December 16, 2025