ఇక వసు కంప్లీట్ చేసిన ప్రాజెక్టు పనుల గురించి రిషి వాళ్ళ ఇంటికి వెళదామని అనుకుంటుంది. కాలేజ్ లో ఇవ్వచ్చు కదా అని జగతి అనడంతో సార్ కాలేజ్ కి వచ్చేసరికి ఆలస్యం అవుతుందని చెప్పి బయల్దేరుతుంది. ఇక రిషి వాళ్ళింటికి వెళ్లగా అక్కడ దేవయాని తన మాటలతో బాగా చెలరేగుతోంది. అంతేకాకుండా ఇదంతా జగతి ఆడిస్తున్న నాటకం అంటూ తన మాటలతో బాగా రెచ్చిపోతుంది. మధ్యలో ధరణి వచ్చి దేవయానిని ఆపినా కూడా రివర్స్ ధరణినే తిడుతుంది. వసు కూడా దేవయాని మాటలతో బాగా ఫైర్ అవుతూ తనకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.
ఇక దేవయాని కాలేజీకి వెళ్లి జగతి పని పడతా అంటూ అనుకోగా ధరణి వద్దు అని మామయ్యకి తెలిస్తే బాగోదు అని చెప్పేసరికి మొత్తానికి కూల్ అవుతుంది. మరోవైపు కాలేజ్ దగ్గర జగతి, మహేంద్ర కూర్చొని మాట్లాడుతుంటారు. జగతి ఎమోషనల్ గా రిషి, వసుల గురించి మాట్లాడుతుంది. వారి మధ్య ఎటువంటి బంధం ఉందో అర్థం కావట్లేదని.. ఎక్కడి వరకు దారితీస్తుందో అని బాగా ఎమోషనల్ అవుతూ మహేంద్ర భుజంపై వాలుతుంది. అది చూసిన రిషి కోపంతో రగిలిపోతాడు. ఇక వెంటనే జగతిని పిలిపిస్తాడు. ఇక తరువాయి భాగం లో రిషి తన మాటలతో జగతిని బాధ పెడతాడు. నీ కడుపులో పుట్టడం నా తప్పు అంటూ జగతిని అనేసరికి మహేంద్ర వచ్చి రిషి పై అరుస్తాడు. ఇక వసుపై కూడా బాగా అరుస్తాడు రిషి.