https://oktelugu.com/

Bigg Boss 5 Telugu Elimination: బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే?

Bigg Boss 5 Telugu Elimination: బిగ్ బాస్ యమ రంజుగా సాగుతోంది. తాజాగా రెండో వారం వీకెండ్ కు వచ్చింది. మొత్తం 19మందిని బిగ్ బాస్ ఇంట్లోకి పంపించిన కింగ్ నాగార్జున ఈసారి 5 మచ్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అన్నట్టుగా హింట్ ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే హౌస్ లో కంటెస్టెంట్లు రచ్చ చేస్తున్నారు. తొలి వారం ఎలిమినేషన్ ఇప్పటికే ముగిసిపోగా ఇప్పుడు రెండో వారానికి వచ్చేసింది. తొలి వారం బూతులతో రెచ్చిపోయిన ‘సరయు’ […]

Written By: , Updated On : September 18, 2021 / 03:50 PM IST
Follow us on

Bigg Boss 5 Telugu Elimination: Who Will Be Eliminated This Week From Bigg Boss

Bigg Boss 5 Telugu Elimination: బిగ్ బాస్ యమ రంజుగా సాగుతోంది. తాజాగా రెండో వారం వీకెండ్ కు వచ్చింది. మొత్తం 19మందిని బిగ్ బాస్ ఇంట్లోకి పంపించిన కింగ్ నాగార్జున ఈసారి 5 మచ్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అన్నట్టుగా హింట్ ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే హౌస్ లో కంటెస్టెంట్లు రచ్చ చేస్తున్నారు. తొలి వారం ఎలిమినేషన్ ఇప్పటికే ముగిసిపోగా ఇప్పుడు రెండో వారానికి వచ్చేసింది. తొలి వారం బూతులతో రెచ్చిపోయిన ‘సరయు’ ఎలిమినేట్ కాగా.. రెండో వారం ఎవరు అవుతారన్నది ఆసక్తి రేపుతోంది. తాజాగా సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరో తేలిపోయింది.

రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ అత్యంత ఆసక్తి రేపుతోంది. ప్రముఖులు ఈ వారం నామినేషన్ లో ఉన్నారు.    ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతున్నారనే విషయం తాజాగా లీక్ అయ్యింది. రేపటి ఎపిసోడ్ ఈరోజే షూటింగ్ చేస్తారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అయ్యింది ఎవరో లీక్ అయిపోయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఆనీ మాస్టర్, ప్రియ, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, ఉమ, లోబో, ఆర్జే కాజల్ నామినేషన్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక హౌస్ లో ప్రస్తుతం నామినేట్ అయిన సభ్యుల్లో అత్యధిక ఓట్లు కమెడియన్ లోబోకు వచ్చాయి. హౌస్ లో అతడు చేస్తున్న కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ కు ప్రేక్షకులు మెచ్చి ఓట్ల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత హౌస్ లో అందరితో మంచిగా ఉంటున్న ‘ప్రియాంక సింగ్’ రెండో ప్లేసులో ఉన్నట్టు తెలిసింది. చిట్టచివరలో హౌస్ లోనే వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న ఉమాదేవికి తక్కువ ఓట్లు వచ్చాయని.. ఈ వారం ఆమె ఎలిమినేట్ కావచ్చని అంటున్నారు. ఇక ఈమెతోపాటు తక్కువ ఓట్లు ‘నటరాజ్ మాస్టర్’కు కూడా  వచ్చాయట. ఆయనకు ఫాన్ ఫాలోయింగ్ లేకపోవడంతో తక్కువ ఓట్లు పడ్డట్టు సమాచారం. సో ఇతడు కూడా ఎలిమినేట్ కావచ్చని ఓటింగ్ ట్రెండ్ ను బట్టి తెలుస్తోంది.

రేపు ఆదివారం రాత్రి ఎవరు ఎలిమినేట్ అవుతారో అధికారికంగా తేలనుంది. అప్పటివరకు ఉమా, నటరాజ్ లలో ఎవరు వెళ్లిపోతారన్నది ఎదురు చూడాల్సిందే..