Kenneth McKenzie: అప్ఘనిస్తాన్ లో చేసిన తప్పును ఒప్పుకున్న అమెరికా..

Kenneth McKenzie:  గత నెలలో అఫ్గనిస్తాన్ లోని కాబుల్ ఎయిర్ పోర్టు సమీపంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో 10 మంది పౌరులతోపాటు పిల్లలు కూడా చనిపోయారు. ఈ దాడిని అమెరికా ఐసిస్ కె జరిపిన దాడికి ప్రతీకారంగా వారిని టార్గెట్ చేసుకుని జరిపినట్లు ప్రకటించినా అందులో నిజం లేదని తేలిపోయింది. దీంతో ఈ మేరకు అమెరికా తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంజీ పేర్కొన్నారు. తమ తప్పిదం […]

Written By: Raghava Rao Gara, Updated On : September 18, 2021 4:23 pm
Follow us on

Kenneth McKenzie:  గత నెలలో అఫ్గనిస్తాన్ లోని కాబుల్ ఎయిర్ పోర్టు సమీపంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో 10 మంది పౌరులతోపాటు పిల్లలు కూడా చనిపోయారు. ఈ దాడిని అమెరికా ఐసిస్ కె జరిపిన దాడికి ప్రతీకారంగా వారిని టార్గెట్ చేసుకుని జరిపినట్లు ప్రకటించినా అందులో నిజం లేదని తేలిపోయింది. దీంతో ఈ మేరకు అమెరికా తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంజీ పేర్కొన్నారు. తమ తప్పిదం వల్లే ఈ నష్టం జరిగినట్లు చెప్పారు. ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామని వివరించారు.

కాబుల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఐసిస్ -కె తీవ్రవాద స్థావరంపై తాము డ్రోన్ దాడి జరిపినట్లు చెప్పినా ఇది తప్పిదమే అని ప్రకటించారు. అమెరికా దళాలు అఫ్గనిస్తాన్ ను వీడి వెళ్లే సమయంలో ఈ దాడి జరిగిందని తెలిపారు. ఇంటిలిజెన్స్ వైఫల్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని అభిప్రాయపడ్డారు. దీనికి బాధ్యత వహించి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. ఇకపై భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

అయితే ఐసిస్ తీవ్రవాదాదులను లక్ష్యంగా చేసుకున్నా తమకు అందిన సమాచారం సరైందని కాదని సూచించారు. ఇందులో దురదృష్టవశాత్తు పౌరులు కూడా చనిపోవడం బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. దీనికి తమ తప్పిదమే కారణమని ఒప్పుకున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడుల క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని చెప్పారు. దీనికి తామే పూర్తి బాధ్యత వహిస్తున్నామని పేర్కొన్నారు.

అమెరికా సైన్యం చేసిన పనికి తామే పూర్తి బాధ్యత వహిస్తున్నామని తెలిపారు. డ్రోన్ దాడిలో చనిపోయిన బాధిత కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. దారుణ తప్పిదం నుంచి తప్పకుండా పాఠం నేర్చుకుంటామని చెప్పారు. అమెరికా చేసిన తప్పిదం వల్లే ఈ అన్యాయం జరిగిందని అందరిలో వస్తున్న ఆగ్రహం దృష్ట్యా మమ్మల్ని క్షమించాలని కోరారు. ప్రపంచం యావత్తు దీనిపై స్పందిస్తున్నక్రమంలో అమెరికా తన తప్పిదాన్ని ఒప్పుకుని ముందుకు రావడం సమంజసమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.