https://oktelugu.com/

Guppedantha Manasu Actress: తన వయసెంతో చెప్పి షాక్ ఇచ్చిన గుప్పెడంత మనసు సీరియల్ నటి..!

సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. సీరియల్ లో అంత పద్దతిగా ఆమెను చూసిన వారు జ్యోతి రాయ్ హాట్ ఫోటో షూట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.

Written By:
  • S Reddy
  • , Updated On : February 2, 2024 / 12:10 PM IST
    Follow us on

    Guppedantha Manasu Actress:  గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్. ఇందులో జగతి పాత్రలో రిషికి తల్లిగా నటించి మెప్పించింది. కాగా జ్యోతి రాయ్ వరుస సినిమా ఆఫర్స్ తో బిజీ కావడంతో గుప్పెడంత మనసు సీరియల్ నుంచి తప్పుకుంది. పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరీర్ లో దూసుకు పోతుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. సీరియల్ లో ట్రెడిషనల్ గా చీరల్లో దర్శనమిచ్చిన జ్యోతి రాయ్ .. నెట్టింట మాత్రం గ్లామర్ షోతో అల్లాడిస్తోంది.

    సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. సీరియల్ లో అంత పద్దతిగా ఆమెను చూసిన వారు జ్యోతి రాయ్ హాట్ ఫోటో షూట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే. అంతలా బోల్డ్ షో తో హీట్ పుట్టిస్తుంది. అయితే జ్యోతిరాయ్ లో ఈ వేరియేషన్స్ చూసి ఫ్యాన్స్ లో ఆమె వయసు ఎంత అనే సందేహాలు వస్తున్నాయి. వికీపీడియా ప్రకారం ఆమె ఏజ్ 38 కానీ రియల్ ఏజ్ తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

    తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన జ్యోతి రాయ్ ఆమె వయసు 30 ఏళ్లు అని చెప్పి ఆశ్చర్యానికి గురి చేసింది. 1994 లో జన్మించినట్లు పాన్ కార్డు చూపించి ప్రూఫ్స్ తో సహా వెల్లడించింది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, ఒక బాబుకు జన్మనిచ్చింది. తర్వాత భర్తతో విబేధాలు రావడంతో అతనికి విడాకులు ఇచ్చింది.తర్వాత పూర్వాజ్ అనే యంగ్ డైరెక్టర్ ని ప్రేమించి, పెళ్లి చేసుకుంది.

    ఇప్పుడు ‘ నో మోర్ సీక్రెట్స్ ‘ అనే మూవీ లో నటిస్తుంది. దీనితో పాటు ప్రెట్టి గర్ల్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. అయితే నో మోర్ సీక్రెట్స్ చిత్రం లోని ఓ పిక్ జ్యోతి రాయ్ షేర్ చేసింది. కాగా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది.ప్రజంట్ కెరీర్ పరంగా జ్యోతి రాయ్ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది.