Naga Vardhini: అక్రమ సంబంధాలు ఎప్పటికైనా ప్రమాదమే. ఒకరిద్దరితో అఫైర్స్ మైంటైన్ చేస్తున్న కొందరు కిలాడీ లేడీలు చివరికి హత్యలు చేయడానికి కూడా వెనుకాడడం తెలీదు. సీరియల్ నటి నాగ వర్దిని ఒక ప్రియుడితో కలిసి మరొక ప్రియుడిని హత్య చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ సంఘటన హైదరాబాద్ కృష్ణానగర్ లో జరిగింది. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ వంటి సీరియల్స్ ద్వారా నటి నాగ వర్దిని ఫేమ్ తెచ్చుకుంది. నాగావర్ధికి నాలుగేళ్ళ క్రితం శ్రీకాకుళంకి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఇద్దరికీ గొడవలు తలెత్తాయి. దీంతో సూర్యనారాయణ ఇంట్లో నుండి నాగ వర్దిని బయటికి వచ్చి అదే అపార్ట్మెంట్ లో మరొక ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో శ్రీను అనే వ్యక్తికి నాగ వర్దిని దగ్గరయ్యారు. అతడితో ఎఫైర్ నడుపుతుందన్న విషయం సూర్యనారాయణకు తెలిసింది. అతడు తరచుగా నాగ వర్దిని ఇంటికి రావడం సూర్యనారాయణ గమనించాడు.
ఈ విషయమై నాగ వర్దినిని సూర్యనారాయణ హెచ్చరించాడు. శ్రీనును వదిలేసి తన వద్దకు రావాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ శ్రీనుతో సన్నిహితంగా ఉండటం నాగ వర్దిని మానుకోలేదు. నాగ వర్దిని, శ్రీను ఇంట్లో ఉన్న సమయంలో సూర్యనారాయణ అక్కడకు వెళ్లారు. దీంతో ముగ్గురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సూర్యనారాయణను నాగ వర్దిని, శ్రీను సెకండ్ ఫ్లోర్ నుండి క్రిందకు తోసేశారు. దీంతో సూర్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నాగ వర్దిని, శ్రీనులను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. అక్రమ సంబంధాల కారణంగా నటి నాగ వర్దిని జైలుపాలయ్యింది. ప్రస్తుతం సూర్యనారాయణ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. సూర్యనారాయణ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.