https://oktelugu.com/

Guntur Karam OTT : ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘గుంటూరు కారం’… ఎప్పుడంటే?

ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో చిత్ర నిర్మాణ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.

Written By:
  • Srinivas
  • , Updated On : February 4, 2024 / 04:55 PM IST

    Guntur Karam ott

    Follow us on

    Guntur Karam OTT : మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈమూవీని త్రివిక్రమ్ డైరెక్షన్ చేసిన విషయం తెలిసిందే. మహేష్ బాబు వరుసగా మాస్ సినిమాలు చేస్తున్నాడు. అటు త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో మాస్ మసాల మూవీ ఉంటుందని ఫ్యాన్స్ ముందే ఎక్స్ పెక్టెషన్ చేశారు. అందుకు అనుగుణంగానే ‘గుంటూరు కారం’లో మంచి మసాలాను దట్టించారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే సంచలనాలు సృష్టించింది. ముఖ్యంగా ఇందులోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కుర్రాళ్లను ఉర్రూతలూగించింది. దీంతో సినిమాపై ఎక్స్ పెక్టేన్ పెట్టుకున్నారు. అయితే ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో చిత్ర నిర్మాణ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.

    హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లోకి వచ్చి హల్ చల్ చేసింది. మహేష్ ఇందులో కొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో అలరించింది. కమర్షియల్ గానూ మూవీ సక్సెస్ అయిందనే చెప్పాలి. అయితే త్రివిక్రమ్ పాత సినిమాల్లోనే ఈ సినిమా ఉందంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. అయితే చాలా మంది గుంటూరు కారం సినిమాను ఆదరించారనే చెప్పవచ్చు. మహేష్ బాబు గతంలో వరుసగా హిట్లు కొట్టడంతో పాటు ఈ సినిమా కూడా బంపర్ హిట్టు కొట్టిందని అన్నారు.

    అయితే కొన్ని రోజుల తరువాత సినిమా ను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ మూవీని ఫిబ్రవరి 9న ఓటీటీలోకి రానుందని అధికారికంగా తెలిపింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీని ఇప్పటికే కొనుగోలు చేసింది. అందువల్ల ఓటీటీ ద్వారా వీక్షించాలనుకునే వారు నెట్ ఫ్లిక్స్ ద్వారా ఫిబ్రవరి 9 నుంచి చూడొచ్చని సినిమా బృందం తెలిపింది. సెంటిమెంట్ తో పాటు యాక్షన్ కలగలిపి రొమాన్స్ ఉన్న గుంటూరు కారం ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా బృందం తాజాగా శుభవార్త తెలిపింది.